Begin typing your search above and press return to search.

గాలి కొడుకు సినీ ఎంట్రీ.. కిరీటి 'జూనియర్' టీజర్ చూశారా?

తాజాగా మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. యూత్, ఎనర్జీ, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ సెలబ్రేషన్ అంటూ మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   27 Jun 2025 6:12 PM IST
గాలి కొడుకు సినీ ఎంట్రీ.. కిరీటి జూనియర్ టీజర్ చూశారా?
X

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ మూవీతో తెరంగేట్రం చేస్తున్నారు. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్నారు. జెనీలియా, వి రవిచంద్రన్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పిస్తుండగా, రజనీ కొర్రపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్న జూనియర్ మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జూనియర్ మూవీని జూలై 18న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

పాన్ ఇండియా రేంజ్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొంతకాలం క్రితం మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. దానితో కిరీటి అందరినీ ఇంప్రెస్ చేశారు. తాజాగా మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. యూత్, ఎనర్జీ, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ సెలబ్రేషన్ అంటూ మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫ్రెండ్ షిప్ కోసం ఆఫర్ లెటర్ పంపిన సీన్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎవడ్రా నువ్వు అన అంటుంటే కిరీట్ పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇస్తారు. ఆ సీన్ మాత్రం అదిరిపోయింది. స్టూడెంట్ గా కనిపించిన కిరీటి.. మెమోరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ తో చిల్ అవుతుంటారు. ఆ తర్వాత శ్రీలీలను మేకర్స్ పరిచయం చేశారు.

ఇంతలో ఎంప్లాయ్ గా జూనియర్ కనిపించారు. ఎవరైనా పైకి వెళ్తే చాలు.. ఆపేయడానికి లాగేయడానికి వచ్చేస్తారు కదా రా అంటూ చెప్పిన లాస్ట్ డైలాగ్ ఎఫెక్టివ్ గా ఉంది. జెనీలియా ఎంట్రెన్స్ తో టీజర్ ఎండ్ చేశారు మేకర్స్. అయితే గ్లింప్స్ ను స్టోరీ లైన్ ను రివీల్ చేయకుండా కట్ చేశారు. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది.

కాగా, కిరీట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉంది. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశారు. డ్యాన్స్ తో దుమ్మురేపారు. రెండు రోల్స్ లో కూడా సరైన రీతిలో ఆకట్టుకున్నారు. డెబ్యూ యాక్టర్ అయినా బాగా నటించినట్లు ఉన్నారు. శ్రీలీలతో కెమిస్ట్రీ ఫన్నీగా, క్యూట్ గా ఉంది. దర్శకుడు రాధా కృష్ణ రెడ్డి ఫోకస్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉందనే చెప్పాలి. మరి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.