చరణ్, తారక్ 'నాటు నాటు'.. బాలయ్య, చిరు చేస్తే..
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్, గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఎలాంటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 12 May 2025 1:10 PM ISTదర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్, గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఎలాంటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులను, మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేసింది. ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకుని తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పింది.
ఇప్పటికే నాటు నాటు పాట ఎవర్ గ్రీనే అని చెప్పాలి. ఎప్పుడు విన్నా అదే జోష్.. అదే ఊపు.. అలాంటి క్రేజ్ ఆ సాంగ్ సొంతం. స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అదుర్స్. ప్రతీ ఒక్క స్టెప్ కూడా నెవ్వర్ బిఫోర్ అనే చెప్పాలి. అప్పుడు ఆ సాంగ్ కోసం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
అందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్. రీసెంట్ గా లండన్ లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ జరిగిన విషయం తెలిసిందే. రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి తన ప్రదర్శనతో అక్కడికి వచ్చిన అతిథులను మంత్రముగ్ధుల్ని చేశారు.
అయితే ఆ ఈవెంట్ కు హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి హాజరయ్యారు. ఆ సమయంలో నాటు నాటు గురించి మాట్లాడారు. ఆ సాంగ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ తాను మర్చిపోలేనని తెలిపారు. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న రోజు బాధ, కష్టం అన్నీ మర్చిపోయామని తెలిపారు.
ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య గురించి ప్రస్తావించారు ఎన్టీఆర్. చిరంజీవి ఎంత గొప్ప డ్యాన్సరో మనందరికీ తెలుసని అన్నారు. ఆ తర్వాత తన బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్ అని తెలిపారు. వీళ్లిద్దరూ కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ వేస్తే అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుందని తారక్ తెలిపారు.
దీంతో హాల్ అంతా ఒక్కసారి కేరింతలు హోరెత్తిపోయింది. జై బాలయ్య, జై చిరు అంటూ నినాదాలతో మారుమోగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. చిరు, బాలయ్య కలిపి నాటు నాటుకు స్టెప్పులు వేస్తే చూడాలని ఉందని చెబుతున్నారు. ఈగర్లీ వెయిటింగ్ అంటూ సందడి చేస్తున్నారు.
