Begin typing your search above and press return to search.

కిరీటి జూనియర్ టీజర్ వచ్చేస్తుందోచ్..!

కిరీటి జూనియర్ సినిమాను భారీ ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కిరీటి తెరంగేట్రం చేస్తున్న సినిమా అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   26 Jun 2025 8:53 PM IST
కిరీటి జూనియర్ టీజర్ వచ్చేస్తుందోచ్..!
X

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా చేస్తున్న సినిమా జూనియర్. రాధా కృష్ణ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కిరీటి సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో జెనిలియా, వి రవిచంద్రన్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ గ్లింప్స్ తో ఇంప్రెస్ చేసిన కిరీటి జూనియర్ నుంచి టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు.





ఈ సినిమాను జూలై 18న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న కిరీటి జూనియర్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కిరీటి, శ్రీ లీల జోడీ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇక సినిమా నుంచి టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది.

కిరీటి జూనియర్ సినిమాను భారీ ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కిరీటి తెరంగేట్రం చేస్తున్న సినిమా అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక టీజర్ తోనే సినిమాపై ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈమధ్య కాలంలో కథ, కథనం నచ్చితే అందులో హీరో ఎవరన్నది కూడా చూడకుండా ఆడియన్స్ హిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కంటెంట్ నచ్చితే చాలు అది ఎవరి సినిమా అయినా ఆదరిస్తారు.

సో కిరీటి జూనియర్ సినిమా కూడా తెలుగు ఆడియన్స్ టార్గెట్ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది. మిగతా భాషల్లో ఎలా ఉన్నా తెలుగులో ఈ సినిమాను ఎక్కువ ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ఎలాగు హీరోయిన్ శ్రీలీలకు తెలుగులో క్రేజ్ ఉంది కాబట్టి అలా కూడా కలిసి వచ్చేలా ఉంది. జూనియర్ సినిమా టీజర్ ఎలా ఉండబోతుంది.. సినిమా కేవలం రొమాంటిక్ ఎంటర్టైనర్ గానే వస్తుందా అందులోనే కొత్త కథనంతో వస్తుందా అన్నది రేపు టీజర్ వచ్చాక తెలుస్తుంది. యూత్ ఫుల్ కథలైనా కూడా ఆడియన్స్ నచ్చేలా స్క్రీన్ ప్లే ఉంటే సూపర్ హిట్ చేస్తున్నారు ఆడియన్స్. మరి ఈ జూనియర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.