Begin typing your search above and press return to search.

గాలి వార‌సుడితో శ్రీలీల అందుకేనా!

మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి త‌న‌యుడు కిరిటీ 'జూనియ‌ర్' చిత్రంతో న‌టుడిగా తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 July 2025 6:00 AM IST
గాలి వార‌సుడితో శ్రీలీల అందుకేనా!
X

మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి త‌న‌యుడు కిరిటీ 'జూనియ‌ర్' చిత్రంతో న‌టుడిగా తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కిరిటీకి జోడీగా తెలుగు న‌టి శ్రీలీల న‌టిస్తోంది. ఆన్ స్క్రీన్ పై ఈ జోడీ ప‌ర్పెక్ట్ గా ఉంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీ తంతో మ్యూజిక‌ల్ హిట్ ఇచ్చేసాడు. పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇదే సినిమాతో జెనీలియా కూడా కంబ్యాక్ అవుతుంది.

దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత తెలుగు సినిమా చేయ‌డం విశేషం. ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చినా వాట‌న్నింటిని కాద నుకుని మ‌రి ఈ సినిమాతో కంబ్యాక్ అవుతుంది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే కిరిటీ స‌ర‌స‌న శ్రీలీల ఏంటి? అనే సందేహం చాలా మందిలో ఉంది. న‌టిగా సీనియ‌ర్ అయింది. త‌న‌కంటూ ఓ ఇమేజ్ ఉంది. `పుష్ప 2` తో పాన్ ఇండియాలో కిసిక్ బ్యూటీ ఫేమ‌స్ అయింది. బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. అంత‌టి పేరున్న న‌టి యువ హీరోతో సినిమా చేయ‌డంపై తాజాగా క్లారిటీ దొరికింది.

శ్రీలీల కుటుంబం చాలా కాలంగా జ‌నార్దాన్ రెడ్డి కుటుంబానికి క్లోజ్ అట‌. శ్రీలీల త‌ల్లి డాక్ట‌ర్ కావ‌డంతో వైద్య ప‌రంగా ఎలాంటి స‌హాయంగానీ, అవ‌స‌రాలు గానీ స్వ‌ర్ణ‌ల‌త చూసుకుంటారు. ఇక శ్రీలీల‌తో కిరిటీ ప‌రిచ‌యం ఈనాటిది కాదు. గ‌త తొమ్మిదేళ్ల‌గా శ్రీలీల‌తో ప‌రిచ‌యం ఉంద‌ని కిరిటీ తెలిపాడు. ఆ ప‌రిచ‌యం కార‌ణంగా త‌న‌తో న‌టించ‌డం సుల‌భ‌మైందన్నాడు. న‌టుడిగా ఎలా చేయాలి? అన్న స‌లహాలు కూడా శ్రీలీల ఇచ్చిందట‌.

`శ్రీలీల మంచి డాన్స‌ర్. త‌న‌తో పాటు నేను కూడా పోటీ ప‌డ్డాను అంతే. మంచి సినిమా తీస్తే ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తారు. నాలాంటి కొత్త వాళ్లు ఎంతో మంది సినిమాల్లో స‌క్స‌స్ అయ్యారు. వాళ్లు విజ‌యం సాధిం చారంటే కార‌ణం మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసారు కాబ‌ట్టే. నా న‌మ్మ‌కం కూడా అదేన‌ని ధీమా వ్య‌క్తం చేసాడు. రాధాకృష్ణ ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన సినిమా ఈనెల 18న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.