Begin typing your search above and press return to search.

సంస్కారంతో న‌మ‌స్క‌రిస్తే యాక్టింగ్ అంటారా?

మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్ త‌న‌యుడు కిరిటీ `జూనియ‌ర్` సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 July 2025 12:34 PM IST
సంస్కారంతో  న‌మ‌స్క‌రిస్తే యాక్టింగ్ అంటారా?
X

మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్ త‌న‌యుడు కిరిటీ `జూనియ‌ర్` సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. న‌టుడిగా పాస్ అయ్యాడు. డాన్సుల ప‌రంగా తిరుగులేని స్టార్ గా ప్రూవ్ చేసుకున్నాడు. తొలి సినిమాతోనే తానేంటో నిరూపించాడు. న‌టుడిగా కిరిటీకి మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని విశ్లేష‌కులు భావి స్తున్నారు. ఇక కిరిటీలో డౌన్ టూ ఎర్త్ క్వాలిటీ అంద‌ర్నీ క‌ట్టి ప‌డేసింది. చిన్న నాటి నుంచి గోల్డ్ స్పూన్ అయినా? తానెక్క‌డా అహంభావం ప్ర‌ద‌ర్శించ‌లేదు. ప్రీ రిలీజ్ఈవెంట్ స‌మ‌యంలో త‌న‌క‌న్నా పెద్ద వాళ్ల కాళ్ల‌కు న‌మ‌స్క‌రించిన త‌న సంస్కారాన్ని చాటుకున్నాడు.

మైనింగ్ కింగ్ కొడుకు అయినా? పెద్ద‌ల విష‌యంలో తానెంత గొప్ప మ‌న‌స్త‌త్వం గ‌ల‌వాడ‌ని ఆ సంస్కార‌మే ప్రూవ్ చేసింది. అయితే కిరిటీ ఇలా న‌మ‌స్క‌రించ‌డంపై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ జ‌రిగింది. కొంత వ్య‌తిరేక‌త కూడా వ్య‌క్త‌మైంది. ఇదంతా కిరిటీ యాక్టింగ్ అంటూ కొన్ని పోస్టులు వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఇదే అంశంపై జూనియ‌ర్ సినిమాకు రెండు పాట‌లు కొరియోగ్ర‌ఫీ చేసిన రేవంత్ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యా లు పంచుకున్నాడు. `పాట‌ల రిహార‌ల్స్ కోసం కిరిటీ ఇంట్లో రెండు నెల‌ల పాటు ఉన్నాను.

వాళ్లంతా మాటీమ్ ను ఎంతో అభిమానంతో చూసుకున్నారు. కిరీటి కూడా మాతో పాటే క‌లిసి తినేవాడు తాగేవాడు. ఏ రోజు కూడా త‌న స్థాయిని చూపించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. త‌న మ‌న‌సులో అలాంటి ఆలోచ‌నే ఉండేది కాదు. వ‌య‌సులో పెద్ద వారి కాళ్ల‌కు న‌మ‌స్క‌రించ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. అది పెద్ద‌లు నేర్పించిన క్ర‌మ‌శిక్ష‌ణ‌. నేను చాలా చిన్న కొరియోగ్ర‌ఫ‌ర్ ని. ఓ సారి మా అమ్మ‌ని కిరిటీకి ప‌రిచ‌యం చేస్తే ఆమె కాళ్ల‌కు కూడా కిరిటీ న‌మ‌స్కారం చేసాడు.

ఆ స‌మ‌యంలో నాకంట నీళ్లు తిరిగాయి. నేనో సామాన్యుడిని..నా త‌ల్లి కాళ్ల‌కు న‌మ‌స్కారం పెడుతు న్నాడేంట‌ని మ‌న‌సులో అనుకుని అత‌డి మ‌న‌సు ఎంత గొప్ప‌ద‌న్న‌ది అర్దం చేసుకున్నాను. అలాంటి కిరిటీ పెద్ద పెద్ద స్టార్లకు, డైరెక్ట‌ర్ల‌కు న‌మ‌స్క‌రించం అన్న‌ది న‌ట‌న ఎలా అవుతుంది. ద‌య‌చేసి ఇలాంటి పోస్టులు పెట్టొద్ద‌ని అభ్య‌ర్దిస్తున్నాను. సంస్కారం అన్నది ఆ కుటుంబం పెంప‌కంలోనే ఉంది. ఎంత పేరొచ్చినా ? ఏ స్థాయికి ఎదిగినా? అహంభావానికి వెళ్లొద్దని జనార్దన్ రెడ్డిగారు నాతో అనడమే అందుకు నిదర్శనం` అని అన్నారు.