వీటితో మళ్లీ బాక్సాఫీస్ కళకళలాడుతుందా?
టాలీవుడ్‌కు జూన్ ప్రారంభం పెద్దగా కలిసి రాలేదు. కారణం ఏ క్రేజీ సినిమా ఈ నెల ప్రారంభంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది.
By: Tupaki Desk | 17 Jun 2025 11:15 AM ISTటాలీవుడ్‌కు జూన్ ప్రారంభం పెద్దగా కలిసి రాలేదు. కారణం ఏ క్రేజీ సినిమా ఈ నెల ప్రారంభంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. దీంతో జూన్ నెల చాలా డల్‌గా ప్రారంభంమైంది. అయితే ఈ నెల మూడవ వారంలో క్రేజీ సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడు అందరిదృష్టి వాటిపై పడింది. టాలీవుడ్ ఇండస్ట్రీ వీటిపై భారీ అంచనాలే పెట్టుకుంది. బ్యాక్‌టు బ్యాక్ క్రేజీ సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేస్తుండటంతో అవి సక్సెస్ ని సాధించి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయని, వసూళ్ల వర్షం కురిపిస్తాయని యావత్ టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు `కుబేర`. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీని సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. జూన్ 20న రిలీజ్ అవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ధనుష్ బిచ్చగాడిగా నటించిన ఈ మూవీలో కోటీశ్వరుడిగా నాగార్జున కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటన్నదే ఈ సినిమా ప్రధాన కథ.
దీనితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ వారి చిన్న సినిమా `8 వసంతాలు` కూడా ఇదే రోజు రిలీజ్ అవుతోంది. ఏడేళ్ల విరామం తరువాత దర్శకుడు ఫణీంద్ర నరిశెట్టి డైరెక్ట్ చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. `మ్యాడ్` ఫేమ్ అనంతిక సనల్ కుమార్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. వరుస ఫ్లాప్‌ల తరువాత కొంత విరామం తీసుకున్న ఆమీర్‌ఖాన్ ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే పట్టుదలతో చేసిన సినిమా `సితారే జమీన్‌పర్`. జెనీలియా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి ఆర్ ఎస్ ప్రసన్న డైరెక్టర్. స్పానిష్ ఫిల్మ్ `ఛాంపియన్స్`కు అధికారిక రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా కూడా ఆశించిన స్థాయికి మించి సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు.
ఈ వారం ఈ మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలతో పాటు విమర్శకులు భావిస్తున్నారు. ఇక వీటితో పాటు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో పలు క్రేజీ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో...
గ్రెన్‌ఫెల్: అన్ కవర్డ్ - జూన్ 20న
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో - జూన్ 21న
జీయో హాట్ స్టార్‌లో...
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్- 2 - జూన్ 20న
సర్వైవింగ్ ఒహియో స్టేట్ - జూన్ 18న
ఫౌండ్ సీజన్ -2 జూన్ 20న
జీ5 ఓటీటీలో....
డిటెక్టీవ్ షేర్డిల్ - జూన్ 20న
గ్రౌండ్ జీరో - జూన్ 20న
ప్రిన్స్ ఫ్యామిలీ - జూన్ 20న
సన్ నెక్స్ట్ ఓటీటీలో...
ఆప్ కైసే హో - జూన్ 20న స్ట్రీమింగ్ అవుతున్నాయి.
