జూలై ఫస్ట్ వీక్.. మూడు సినిమాలు.. మూడు జోనర్లు..
ఎప్పటిలానే జూలై ఫస్ట్ వీక్ లో పలు సినిమాలు థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 1 July 2025 9:15 AM ISTఎప్పటిలానే జూలై ఫస్ట్ వీక్ లో పలు సినిమాలు థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక్కడ విశేషమేమింటే.. మూడు సినిమాలు.. మూడు విభిన్న జోనర్స్ లో రూపొందాయి. దీంతో ప్రతి ఒక్క మూవీ కచ్చితంగా ఆడియన్స్ ను స్పెషల్ ఎక్సీపీరియన్స్ ఇవ్వనుందనే చెప్పాలి.
అయితే జూలై 4వ తేదీన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తమ్ముడు మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు హీరో సిద్ధార్థ్ యాక్ట్ చేసిన 3 బీహెచ్ కే మూవీ తెలుగు, తమిళంలో థియేటర్స్ రిలీజ్ కానుంది. ఆ రెండింటితోపాటు జురాసిక్ వరల్డ్ డొమినియన్ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన జురాసిక్ వరల్డ్ రీ బర్త్ మూవీ సందడి చేయనుంది.
అక్క- తమ్ముడు అనుబంధాలతో అల్లుకున్న స్టోరీతో నితిన్ తమ్ముడు మూవీ రూపొందుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీంతో పాటు క్రీడా నేపథ్య అంశాలు కూడా యాడ్ చేశారు మేకర్స్. ఆర్చరీ ప్లేయర్ గా నితిన్ కనిపించనున్నారు. ఆయనకు నితిన్ అక్కగా సీనియర్ నటి లయ నటించారు. ఈ సినిమాతోనే ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు.
దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించగా, సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ అందుకున్న తమ్ముడు మేకర్స్.. ఇప్పుడు రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కచ్చితంగా హిట్ అందుకుంటామనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు, హీరో సిద్ధార్థ్.. ఇప్పుడు 3 బీహెచ్ కే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా శ్రీగణేశ్ తెరకెక్కిస్తున్నారు.
కామెడీ, భావోద్వేగాలు, డ్రామాతో రూపొందుతున్న ఆ సినిమాను అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మీఠా రఘనాథ్, చైత్ర ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇంటిల్లిపాదినీ అలరించే, అన్ని రకాల కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఆ సినిమా.. రిలీజ్ కు రెడీ అవుతోంది.
మరోవైపు, జురాసిక్ వరల్డ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏడో భాగం రాబోతోంది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ సీక్వెల్ గా రూపొందుతున్న జురాసిక్ వరల్డ్ రీ బర్త్ రిలీజ్ కానుంది. కొత్త యుగం పుట్టిందని ఇటీవల అనౌన్స్ చేసిన మేకర్స్.. ఫ్రాంచైజీలో ఏడో పార్ట్ స్పెషల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. గరేత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మరి మూడు చిత్రాలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో వేచి చూడాలి.
