Begin typing your search above and press return to search.

అందుకే షారుక్‌తో కలిసి జూహీ IPL చూడదు

ప్ర‌తిసారీ జూహీ ఐపీఎల్ మ్యాచ్ ల‌లో క‌నిపించేవారు.. కానీ ఇటీవ‌ల క‌నిపించ‌డం లేదు ఎందుక‌నో!! వివ‌రాల్లోకి వెళితే...

By:  Tupaki Desk   |   5 April 2024 4:58 AM GMT
అందుకే షారుక్‌తో కలిసి జూహీ IPL చూడదు
X

కింగ్ ఖాన్ షారూఖ్‌- జూహీ చావ్లా స్నేహానుబంధం ఎంతో గొప్ప‌ది. ఆ ఇద్ద‌రూ న‌టులుగా సినీరంగంలో క‌లిసే ప్ర‌యాణించారు. స్టార్లుగా రాణించారు. ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారు. వ్యాపార‌వేత్త‌లుగా వంద‌లు వేల కోట్ల సామ్రాజ్యాల‌ను విస్త‌రించిన ఘ‌నాపాటీలు. వీట‌న్నిటినీ మించి ఆ ఇద్ద‌రి స్నేహం ఎంతో ఆద‌ర్శ‌నీయ‌మైన‌ది. రెండు చేతులు క‌లిపితే.. వ్యాపారంలో న‌మ్మ‌కంగా ఉన్న‌తంగా వ్య‌వ‌హ‌రిస్తే, వంద‌ల కోట్ల లాభాలు సుసాధ్య‌మేన‌ని నిరూపించారు. అందుకే ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ స‌హ‌య‌జ‌మానులుగా ఆ ఇద్ద‌రూ క‌లిసే ఉన్నారు. ప్ర‌తిసారీ జూహీ ఐపీఎల్ మ్యాచ్ ల‌లో క‌నిపించేవారు.. కానీ ఇటీవ‌ల క‌నిపించ‌డం లేదు ఎందుక‌నో!! వివ‌రాల్లోకి వెళితే...

IPL 2024 సీజన్ పూర్తి స్వింగ్‌లో ఉంది. టోర్నమెంట్‌లో షారుఖ్ ఖాన్ జట్టు బాగా రాణిస్తోంది. ఇటీవ‌ల‌ వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో KKR జట్టు విజయం సాధించింది. SRK కూడా మ్యాచ్‌ను వీక్షించారు. KKR జ‌ట్టుకు నటి జూహీ చావ్లా ఆమె భర్త సహ యజమానులు. అ యితే ఇటీవ‌ల జూహీ ఎక్కడా మ్యాచ్‌లలో కనిపించడం లేదు. దీని గురించి జూహీని అడిగితే SRK తో మ్యాచ్ చూడటం చాలా కష్టం అని చెప్పింది.

ఒకప్పటి మేటి కథానాయిక జూహీ చావ్లా మాట్లాడుతూ, ''షారూఖ్‌తో మ్యాచ్ చూడటం చాలా కష్టం. జట్టు ఓడిపోయినప్పుడల్లా అతడు తన నిరాశను నాపై చూపిస్తాడు.యు నేను దానిని భరించలేను. కాబట్టి అతడు వస్తున్నప్పుడు నేను దూరంగా ఉంటాను'' అని న‌వ్వేసారు. జూహీ - SRK వ్యాపార భాగస్వాములు. చాలా సన్నిహిత కుటుంబ స్నేహితులు. SRK కుమారుడు ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు అతడి కొడుకును బయటకు తీసుకురావడంలో జూహీ- ఆమె భర్త ప్రధాన పాత్ర పోషించారు. జూహీ చావ్లా తెలుగులో యువ‌సామ్రాట్ నాగార్జున స‌ర‌స‌న విక్కీ దాదా చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. హిందీ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా జూహీ న‌టించారు.