'జూబ్లీ-2' ఈసారి చిత్ర పరిశ్రమలే షాక్ అయ్యేలా!
గతేడాది రిలీజ్ అయిన `జూబ్లీ` సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 May 2025 10:30 AMగతేడాది రిలీజ్ అయిన `జూబ్లీ` సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా అనే రంగుల ప్రపంచం వెనుక రాజకీయాల గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు. అతిదీరావు హైదరీ, ప్రోసేన జీత్ ఛటర్జీ, అపరశక్తి ఖురానా, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో విక్రమాదిత్యామోత్వానే తెరకెక్కించిన సిరీస్ ఇది. సినీ పరిశ్రమ స్వర్ణయుగాన్ని చూసిన రోజుల పాటు అందులో రాజకీయాలను చర్చించారు.
గత ఏడాది రిలీజ్ అయిన సిరీస్ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పడ్డారు. ఈ నేపథ్యంలో `జూబ్లీ 2`కూడా తెర కెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పీరియాడిక్ డ్రామాకి సీక్వెల్ రాబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. మరింత శక్తి వంతంగా రెండవ భాగం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో పార్ట్ 2లో చాలా ఆసక్తికర విష యాలు చర్చించే అవకాశం ఉందని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి.
ఇండస్ట్రీలో చీకటి కోణం అంటే? ఆ మధ్య బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం పై పెద్ద ఎత్తున ఉద్యమం జరి గిన సంగతి తెలిసిందే. ఏకంగా అది మీటూ ఉద్యామానికే తెర తీసింది. అవకాశాల పేరుతో ఇండస్ట్రీలో లైం గిక దోడిపి ఎలా జరుగుతుందన్నది బాధిత మహిళలు వాపోయిన సంగతి తెలిసిందే. కొంత మంది తృటిలో తప్పించుకున్నా వైనాని....బంధీలుగా మారిన వైనాన్ని ఎంతో ధైర్యంగా మీడియా ముందుకొచ్చి చెప్పారు.
తమ జీవితాల్లో నవతరం జీవితాలు ఛిద్రం కాకూడదన్న ఉద్దేశంతో ముందుకొచ్చారు. ఇలాంటి అంశాలను `జూబ్లీ 2` లో తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చాలా విషయాలు బట్ట బయల వుతాయి. అయితే ఆ పాత్రలకు నేరుగా పేర్లు పెట్టరు...కల్పిత పాత్రలతోనే...కల్పిత కథగానే చెప్పే అవ కాశం ఉంటుంది. లైంగిక అరోపణలు దేశంలో అన్ని చిత్ర పరిశ్రమలపై ఉన్న సంగతి తెలిసిందే.