Begin typing your search above and press return to search.

హీరోల్లో తారక్ @సంథింగ్ స్పెష‌ల్!

అంద‌రి హీరోల‌కంటే ఆయ‌న‌లో కొన్ని క్వాలిటీలు తార‌క్ ని అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గర చేసాయి. న‌టుడిగా త‌న‌కంటూ కొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాల‌తో కొన‌సాగుతున్నాడు.

By:  Tupaki Desk   |   11 April 2024 5:30 PM GMT
హీరోల్లో తారక్ @సంథింగ్ స్పెష‌ల్!
X

చిరంజీవి..నాగార్జున‌..వెంకేట‌ష్‌..బాల‌య్య త‌రం హీరోల త‌ర్వాత వాళ్ల వార‌సులు.. చాలా మంది హీరోలు తెర‌పైకి వ‌చ్చారు. మ‌హేష్..రామ్ చ‌ర‌ణ్‌..బ‌న్నీ... తారక్..ప్ర‌భాస్..రానా..రామ్ ఇలా త‌ర్వాత త‌రం వార‌స‌త్వంతో ఇండస్ట్రీ క‌ళ‌క‌ళాడుతోంది. ఈస్టార్ హీరోలంద‌రికీ కోట్ల‌లో అభిమానులున్నారు. దైవ స‌మానంగా భావించే హీరోలు చాలా మందే ఉన్నారు. అభిమానుల ప‌ట్ల ఆ స్టార్ హీరోలు అంతే ప్రేమాభిమానాలతో ఉంటారు. కానీ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం సంథింగ్ స్పెష‌ల్.

అంద‌రి హీరోల‌కంటే ఆయ‌న‌లో కొన్ని క్వాలిటీలు తార‌క్ ని అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గర చేసాయి. న‌టుడిగా త‌న‌కంటూ కొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాల‌తో కొన‌సాగుతున్నాడు. అందుకే దేశ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ రాజ‌మౌళి సైతం అభిమా నించే హీరో అయ్యాడు. ఇక వాక్చుత‌ర్యంలో యంగ్ టైగ‌ర్ కి పోటీగా మ‌రో హీరో లేడ‌నే చెప్పాలి. వేదిక‌ల‌పై అంత‌నంత గొప్ప‌గా ఎవ్వ‌రూ మాట్లాడ‌లేరు అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. గుక్క తిప్ప‌కుండా ఉన్న చోట‌నే ఎలాంటి క‌ద‌లిక లేకండా అన‌ర్గ‌ళంగా మాట్లాడే స‌త్తా ఉన్న న‌టుడు తార‌క్ మాత్ర‌మే.

ప్రతీ వాక్యంతోనూ ఆక‌ట్టుకోవ‌డం తార‌క్ లో మ‌రో ప్ర‌త్యేక‌త‌. అందుకే ఒకానొక స‌మ‌యంలో టీడీపీ పార్టీ క్యాంపెనెయిన‌ర్ గా మారాడు. అలా తెలుగు త‌మ్ముళ్ల‌కు తార‌క్ ఎంతో ద‌గ్గ‌ర‌య్యాడు. త‌న వాక్చుత‌ర్యంతో గొప్ప నాయ‌కుడికి ఉండాల్సిన ల‌క్ష‌ణాలు...మేథ‌స్సు అన్ని జూనియ‌ర్ రామారావు లో ఉన్నాయ‌ని ఆనాడే ప్ర‌శంస‌లు అందుకున్నాడు. తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డు అనిపించాడు. ఇక స‌మాజం ప‌ట్ల అంతే బాధ్య‌త‌గానూ త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

అవేర్ నెస్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న స‌మ‌యంలో యువ‌త‌ని చైత‌న్య ప‌ర‌చే ప్ర‌సంగాలు తార‌క్ ఎదుగుద‌ల‌కు అద‌నంగా క‌లిసొస్తున్నాయి. ఏమాట మాట్లాడినా..ఎలా మాట్లాడినా..మాట్లాడిన ప్ర‌తీ మాట మ‌న‌సుల్లోతోల్లో నుంచి రావ‌డం అత‌నికే చెల్లింది. ఇక అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడ‌టంలో అత‌నంత గొప్ప వ‌క్తగా మ‌రో హీరో లేడు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. త‌న సినిమా ఈవెంట్ల‌కు వ‌చ్చిన ప్ర‌తీ అభిమాని ఎంతో జాగ్ర‌త్త‌గా ఇంటికి చేరుకోవాలని...మీకోసం మీత‌ల్లిదండ్రులు...అక్చచెల్లెళ‌లు..అన్న‌ద‌మ్ములు ఎదురు చూస్తున్నారని చెప్ప‌డం అత‌నికే చెల్లింది. ముందు కుంటుంబం..ఆ త‌ర్వాతే మేము..మా హీరోలం అంటూ చెప్ప‌డం అత‌నికే సాధ్య‌మైంది. అందుకే అభిమానులంద‌రికీ తార‌క్ ఎప్ప‌టికీ సంథింగ్ స్పెష‌ల్.