యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీరే కోరిక? తీరని కోరిక!
'నాటు నాటు' పాటకు మెగాస్టార్ చిరంజీవి-నటసింహ బాలకృష్ణ స్టెప్పులు వేస్తేచూడాలని ఉందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 May 2025 11:30 AM'నాటు నాటు' పాటకు మెగాస్టార్ చిరంజీవి-నటసింహ బాలకృష్ణ స్టెప్పులు వేస్తేచూడాలని ఉందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే. లండన్ వేదికగా తారక్ ఈ వ్యాఖ్యలు చేసారు. నిజంగా పాటకు లెజెండ్లు ఇద్దరు కలిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇద్దరు మంచి డాన్సర్లు. పోటాపోటీగా డాన్సులు చేస్తారు. పాత రోజుల్లో ఇద్దరి మధ్య మంచి పోటీ వాతావరణం కనిపించేది.
ఈ నేపథ్యంలో తారక్ వాళ్లిద్దర్నీ కలిసి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసారు. మరి ఇది జరిగేదేనా? ఇదే తిరే కోరికేనా? తీరని కోరిక అంటే? అదంత ఈజీగా జరిగేది కాదు. ప్రస్తుతం ఇద్దరి వయసు 60 ఏళ్లు పైబడింది. బాలయ్య కంటే చిరంజీవి వయసులో కొన్ని సంవత్సరాలు పెద్ద. నాటు నాటు పాటకు డాన్సు చేయా లంటే చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. సింగిల్ కాలిపై హిప్ మూవ్ మెంట్స్ ఇవ్వాలి. టాప్ టూ బాటమ్ బాడీ అంతా షేక్ అవుతుంది.
60 ప్లస్ లో ఆ రేంజ్ లో స్టెప్స్ అనుకున్నంత సులభం కాదు. ఈ పాట సమయంలో చరణ్-తారక్ చాలా కష్టపడ్డారు. నెలలు పాటు రిహార్సల్స్ చేసారు. సెట్స్ లో చాలా టేక్ లు తీసుకున్నారు. ఏ మూవ్ మెంట్ సింగిల్ టేక్ లో ఒకే అయింది కాదు. వయసులో ఉన్న వారిద్దరే అంత కష్టపడితే? 60 ప్లస్ హీరోలు ఇంకెంత శ్రమించాలి. కానీ లెజెండరీలిద్దరు తలుచుకుంటే పెద్ద కష్టం కాదు. కాకపోతే పాత అనుభవాన్ని బయటకు తీయాలి.
ఇద్దరు 30 ఏళ్ల క్రితం ఎనర్జీకి కూడగట్టుకోవాలి. అసలు ఈ ప్రపోజల్ చిరంజీవి-బాలయ్య వద్దకు వెళ్తే తొలుత వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. ఒకే ప్రేమ్ లో కలిసి కనిపించాలని వాళ్లు ఆశప డుతున్నారు. కానీ అది నటన పరంగా. డాన్సుల పరంగా పోటీ పడాలనే ఆలోచన ఉన్నట్లు ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. అభిమానుల పరంగానే ఆ రకమైన పోటీ కనిపించేది. ఇదంతా కాదుగానీ కానీ చిరు రెడీ అంటే? బాలయ్య ఢీ అంటారు? ఆవిషయంలో బాలయ్య ఎక్కడా తగ్గరు. అందులో ఎలాంటి డౌట్ లేదు.