Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నటించిన సీరియల్ ఏంటో తెలుసా?

నాడు పెద్దలు అన్న మాటలు నేడు నిజమయ్యాయి. నేడు ఎన్టీఆర్ రేంజ్ కూడా పెరిగిపోతుండడంతో ఆయన అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   16 Aug 2025 7:00 AM IST
ఎన్టీఆర్ నటించిన సీరియల్ ఏంటో తెలుసా?
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నేడు గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. 'బాల రామాయణం' సినిమాలో అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచి అందరి హృదయాలు దోచుకున్న ఎన్టీఆర్.. అప్పట్లోనే తాత అంత గొప్పవాడు అవుతాడని, అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. నాడు పెద్దలు అన్న మాటలు నేడు నిజమయ్యాయి. నేడు ఎన్టీఆర్ రేంజ్ కూడా పెరిగిపోతుండడంతో ఆయన అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఎన్టీఆర్.. ఒక సీరియల్ లో నటించారని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యం వేసినా.. ఎన్టీఆర్ మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సీరియల్లో నటించారు. ఎన్టీఆర్ తన కెరియర్ ఆరంభంలో.. ప్రముఖ ఛానల్ ఈటీవీలో ప్రసారమైన 'భక్త మార్కండేయ' అనే సీరియల్లో ఎన్టీఆర్ నటించారు. ఈ సీరియల్లో మార్కండేయుడి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు ఎన్టీఆర్. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన..ఆ గెటప్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇకపోతే ఈ సీరియల్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ప్రసారమైనట్లు సమాచారం. ఇకపోతే ఎన్టీఆర్ కూడా సీరియల్ లో నటించారని తెలిసి అభిమానులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సీరియల్ ఎప్పుడు ప్రసారమైంది? ఇప్పుడు అందుబాటులో ఉందా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.

ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించిన వార్ 2 సినిమాలో నటించారు. ఈ సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈయన.. ఇందులో రా ఏజెంట్ గా విలన్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. నిజానికి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కొన్ని ఏరియాలలో హరిహర వీరమల్లు కలెక్షన్ లను కూడా క్రాస్ చెయ్యకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటించగా.. బాలీవుడ్లో మొదటి సినిమా చేసినా.. మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకోలేకపోయారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు సగానికి పైగా పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ కొట్టాలని ఎన్టీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 కూడా చేయబోతున్నారు ఎన్టీఆర్. ఇవన్నీ కూడా భారీ సక్సెస్ అందుకుంటే మాత్రం ఎన్టీఆర్ రేంజ్ మరో మెట్టు ఎక్కుతుంది అనడంలో సందేహం లేదు.