Begin typing your search above and press return to search.

వార్-2 ఎఫెక్ట్.. ఇక అవి ఆపేయాల్సిందే

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్-2’ అతడికి ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ తెచ్చి పెడుతుందని, మార్కెట్‌ను విస్తరిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

By:  Garuda Media   |   23 Aug 2025 5:00 AM IST
వార్-2 ఎఫెక్ట్.. ఇక అవి ఆపేయాల్సిందే
X

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్-2’ అతడికి ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ తెచ్చి పెడుతుందని, మార్కెట్‌ను విస్తరిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఎన్టీఆర్‌కు తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది. హిందీలో హృతిక్ స్టార్ పవర్ వల్ల ఓ మోస్తరుగా ఆడింది. ఇంకా థియేటర్లలో ఉన్నప్పటికీ.. ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ డిజాస్టర్ అనడంలో సందేహాలేమే లేవు. ఓ భారీ, క్రేజీ ప్రాజెక్టుతో బాలీవుడ్లోకి తారక్ ఇవ్వాలనుకోవడం మంచి ఆలోచనే. యశ్ రాజ్ ఫిలిమ్స్, అయాన్ ముఖర్జీ, హృతిక్ రోషన్.. ఈ కాంబినేషన్ సూపరే. కానీ తారక్ ఎంచుకున్న జానర్, టైమింగ్ పెద్ద మైనస్ అయ్యాయి.

యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్ అంటే స్పై థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్శ్.. అంటూ ఒక కేటగిరీ పెట్టి మరీ వాళ్లు ఈ జానర్లో సినిమాలు తీస్తున్నారు. ఐతే ఏక్ థా టైగర్, వార్, పఠాన్ సినిమాల వరకు బండి బాగానే నడిచింది. ప్రేక్షకులు ఈ భారీ యాక్షన్ సినిమాలను బాగా ఆదరించారు. కానీ మొదట్లో కొత్తగా, ఎగ్జైటింగ్‌గా ఉన్నది ఏదైనా తర్వాత మొహం మొత్తడం మామూలే. కథలు మార్చకుండా ఇటు అటు తిప్పి భారీ యాక్షన్ జోడించి సినిమాలు తీస్తుండడంతో జనాలకు చిరాకు వచ్చేసింది. టైగర్-3 సినిమాను అలాగే తిరస్కరించారు. పాకిస్థాన్ నుంచి ఇండియాకు ముప్పు వాటిల్లడం.. హీరో రంగంలోకి దిగి శత్రు దేశం మిషన్‌ను భగ్నం చేయడం.. ఇలాంటి కథలు బాలీవుడ్లో లెక్కకు మిక్కిలి తెరకెక్కాయి. ఓవైపు యశ్ రాజ్ వాళ్లు, ఇంకోవైపు వేరే నిర్మాణ సంస్థలు ఇవే కథలు తీసి తీసి జనాలకు మొహం మొత్తేలా చేశారు. గత ఏడాది బడేమియా చోటేమియా, ఫైటర్ లాంటి సినిమాలు కూడా జనాల తిరస్కారానికి గురయ్యాయి. ఇలాంటి టైంలో ‘వార్-2’ సైతం అదే అరిగిపోయిన కథతో తెరకెక్కడం, రవ్వంతైనా కొత్తదనం లేకపోవడం, ఇలాంటి భారీ యాక్షన్ ఘట్టాలు చాలా సినిమాల్లో చూసి ఉండడంతో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు వచ్చిన ఫలితం చూశాక.. ఇక యశ్ రాజ్ వాళ్లు స్పై యూనివర్శ్‌ను మూసేయక తప్పేలా లేదు.