తారక్ లైనప్ అంతా గజిబిజీ.. వార్ 2 తర్వాత ఏంటి
వరుస సినిమాలు లైన్ లో పెట్టిన ఆయన.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఉన్నారు.
By: M Prashanth | 5 Aug 2025 10:44 PM ISTజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు లైన్ లో పెట్టిన ఆయన.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఇక త్వరలోనే ఆయన లీడ్ రోల్ లో నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2 ప్రమోషన్ లను కూడా ప్రారంభించనున్నారు.
ఈ రెండు ప్రాజెక్ట్ లు మినహాయిస్తే, ఎన్టీఆర్ కు ఇంకా క్రేజీ లైనప్ ఉంది. కానీ ఇందులో ఏది ముందుగా పట్టాలెక్కిస్తారా అనేది కన్ ఫ్యూజన్ గా ఉంది. ఏది ముందు సెట్స్ మీదకు వెళ్తుందో అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే తారక్ త్వరలోనే వార్ 2 సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు. ఈ ప్రమోషన్స్ లో ఆయన లైనప్ గురించి ఏమైనా క్లూ ఇస్తారా చూడాలి.
అయితే వార్ 2 ప్రమోషన్ లో భాగంగా తారక్ పాల్గొనే ప్రెస్ మీట్ లలో ఆయనకు లైనప్ గురించి అనేక ప్రశ్నలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. తారక్ ను దేవర 2తో పాటు అతని ఇతర చిత్రాల గురించి అడగవచ్చు. అయితే దేవర 2 ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యింది. దర్శకుడు కొరటాల శివ కూడా స్క్రిప్ట్ పై పని చేస్తున్నట్లు సమాచారం. దీనితోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మురుగన్ అనే మైథలాజికల్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆయన ప్రాజెక్టుల్లో ఈ సంవత్సరం చివరి నాటికి ప్రశాంత్ నీల్ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని ఎన్టీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. తర్వాత దేవర 2 సినిమాను ప్రారంభించి, ఆపై త్రివిక్రమ్ సినిమాపై దృష్టి పెడతారని తెలుస్తోంది. అయితే ఇక్కడ త్రివిక్రమ్ సినిమా గురించి స్పష్టత లేదు. మరోవైపు తారక్.. జైలర్ ఫేమ్ దర్శకుడు నెల్సన్ తో ఓ సినిమా చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
ఇవే కాకుండా అమరన్ దర్శకుడితోనూ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే వార్ 2 రిలీజ్ తర్వాత, ఎన్టీఆర్ కు బాలీవుడ్ నుండి కూడా మరికొన్ని ఆఫర్లు రావొచ్చు. కాబట్టి, అతను తన తదుపరి ప్రాజెక్టులపై జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఏదైమైనా వార్ 2 ప్రమోషన్ల సమయంలో తారక్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
