Begin typing your search above and press return to search.

తారక్ 'డ్రాగన్'.. టోవినో ప్లేస్ లో ఎవరు?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   12 April 2026 1:00 AM IST
తారక్ డ్రాగన్.. టోవినో ప్లేస్ లో ఎవరు?
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. ఇంటర్నేషనల్ రేంజ్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఆ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే ఆ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమాలో పవర్‌ ఫుల్ విలన్ పాత్ర కోసం మలయాళ నటుడు టోవినో థామస్ పేరు గతంలో వినిపించింది. కానీ తాజాగా ఆయన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు రీసెంట్ గా స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఆ నిర్ణయం తీసుకోవడానికి పర్సనల్ తోపాటు ప్రొఫెషనల్ రీజన్స్ ఉన్నాయని తెలిపారు.

టోవినో తప్పుకోవడంతో ఇప్పుడు ఆ కీలక పాత్ర కోసం మరో స్టార్‌ ను రంగంలోకి దించేందుకు మూవీ టీమ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడితో చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ నటుడు ఎవరు అన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.

విలన్ రోల్ మార్పుతో డ్రాగన్ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఆ చిత్రం, తాజా పరిణామాలతో మరింత హైప్ సొంతం చేసుకుంటోంది. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, ఎన్టీఆర్ పవర్‌ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.

అయితే దేవర వంటి భారీ విజయానంతరం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కావడం డ్రాగన్ పై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎలివేట్ చేసే స్టైల్‌ కు అభిమానులు ఫిదా అవుతుంటారు. ఈ నేపథ్యంలో తారక్‌ ను సినిమాలో ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

ఇక చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కనిపించనున్నారు. సంగీత బాధ్యతలు రవి బస్రూర్ నిర్వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి, తారక్- నీల్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్‌ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. కొత్త అప్డేట్స్‌ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పుడు విలన్‌ గా ఎవరిని ఎంపిక చేశారన్నది తెలియాలంటే వేచి చూడాలి.