తారక్ పైనాపిల్ కర్రీ స్పెషలిస్ట్!
పైనాపిల్ కర్రీ చేయడంలో తారక్ స్పెషలిస్ట్ అని తన స్నేహితుడు రాజీవ్ కనకాల తెలిపాడు.
By: Tupaki Desk | 19 Jun 2025 8:15 AM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ టేస్టీ బిర్యానీ కుక్. అందులో ఎలాంటి డౌట్ లేదు. తారక్ బిర్యానీకి సెలబ్రిటీలెంతో మంది అభిమానులున్నారు. ఇంటికొచ్చిన అతిధులెవరికైనా తన చేతి వంట వాటం చూపిస్తాడు. చికెన్ ..మటన్ బిర్యానీలు తానే స్వయంగా వండి వడిస్తాడు. ఈ పనిని తారక్ ఎంతో ఇష్టపడతాడు. అలాగే తాను కూడా మంచి పుడ్డీ. ముక్క లేనిదే ముద్దు దిగదు...బిర్యానీ లేదని వారం గడవదు.
అంతే కాదండోయ్ తారక్ ఓ కర్రీ స్పెషలిస్ట్ అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైనాపిల్ కర్రీ చేయడంలో తారక్ స్పెషలిస్ట్ అని తన స్నేహితుడు రాజీవ్ కనకాల తెలిపాడు. తారక్ వండిన ఆ కర్రీ టేస్ట్ చూస్తే మళ్లీ మళ్లీ అడగాలినిపించే రుచిగా చేస్తాడన్నారు.ఈ రెసిపీ తారక్ మాత్రమే తెలుసన్నాడు. ఈసారి కలిసినప్పుడు తారక్ ని ఆ రెసీపీ ఏంటో యూట్యూబ్ లో పెట్టమంటాను అని అన్నారు.
దీంతో తారక్ అభిమానులు ఆ పనేదో తొందరగా చేయండి సార్ పోస్టులు పెడుతున్నారు. పైనాపిల్ కర్రీ చేయడం అన్నది ఇంత వరకూ ఎక్కడా వినలేదు. తారక్ అందులో స్పెషలిస్ట్ అంటే ఇంకా చాలా వంట కాలే తెలిసి ఉంటాయి. నాన్ వెజ్ వంటకాలు తారక్ ఎంతో ఇష్టపడి వండుతాడు. వాటిని అంతే గొప్పగా ఆస్వాదిస్తాడు కూడా. అయితే ఈ మధ్య కాలంలో పిట్ నెస్ ...హీరోయిక్ లుక్ పై దృష్టి పెట్టడంతో పుడ్ కి సంబంధించిన విషయాలేవి పెద్దగా బయటకు రావడం లేదు.
తారక్ కూడా పుల్ డైట్ లోకి దిగిపోయాడు. సినిమాల కోసం తప్పడం లేదు. బరువు తగ్గాలంటే తారక్ చెప్పే గొప్ప చిట్కా ఒక్కటే. తిండి మానేస్తే బరువు తగ్గుతాం. రోగాల భారినుంచి తప్పించుకుంటాంమంటాడు. ఇది నిజమేతే అన్నింటికి నాలుకే శత్రువు.
