తారక్ మరో హిందీ మూవీనా? అసలు ఛాన్సే లేదా?
ముఖ్యంగా బాలీవుడ్ డెబ్యూతో ఎన్టీఆర్ హిట్ అందుకుంటారని అంతా భావించగా.. సీన్స్ మొత్తం రివర్స్ అయింది. సినిమా రిజల్ట్ తో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు.
By: M Prashanth | 20 Dec 2025 10:00 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పటికే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ మూవీతో నార్త్ లో యమా క్రేజ్ సంపాదించుకున్న తారక్.. రీసెంట్ గా వార్-2 చిత్రంతో డైరెక్ట్ హిందీ డెబ్యూ చేశారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందింది ఆ చిత్రం.
సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించగా.. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన వార్-2 దారుణంగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.
ముఖ్యంగా బాలీవుడ్ డెబ్యూతో ఎన్టీఆర్ హిట్ అందుకుంటారని అంతా భావించగా.. సీన్స్ మొత్తం రివర్స్ అయింది. సినిమా రిజల్ట్ తో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో అనవసరంగా తారక్.. ఆ సినిమా చేశారని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఏదో అనుకుంటే.. ఇంకేదో చేశారని డైరెక్టర్ అయాన్ ముఖర్జీపై తీవ్రంగా మండిపడ్డారు.
అయితే వార్-2 షూటింగ్ సమయంలో తారక్ మరిన్ని హిందీ సినిమాలు చేస్తారని ప్రచారం జరిగింది. లైన్ లో కూడా పెట్టారని వార్తలు వచ్చాయి. కానీ వార్-2 తర్వాత మాత్రం ఇప్పుడెలాంటి బాలీవుడ్ చిత్రాలు చేయరని టాక్ వినిపించింది. రీసెంట్ గా మరో హిందీ మూవీ కోసం తారక్ ను కాంటాక్ట్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో ఫ్యాన్స్ అస్సలు ఓకే చెప్పొద్దు అన్న అంటూ పోస్టులు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వినికిడి. అసలు ఎవరూ కూడా తారక్ ను సంప్రదించలేదని సమాచారం. ఏ సినిమా కోసం కూడా చర్చలు జరగలేదని తెలుస్తోంది. అయినా ఒకవేళ కాంటాక్ట్ చేసినా.. హిందీ మూవీ చేసే టైమ్, నటించే ఇంట్రెస్ట్ తారక్ కు లేదట.
అందుకే మరో బాలీవుడ్ సినిమాలో ఆయన నటించే ఛాన్స్ లేదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వార్-2 డిజాస్టర్ తర్వాత భారీ హిట్ అందుకోవడానికి తారక్ సిద్ధమవుతున్నారు. వివిధ సినిమాలను ఇప్పటికే లైన్ లో పెట్టేశారు. ప్రస్తుతం కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్టు షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ఓ పీరియాడిక్ మూవీ, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా చేయనున్నారు. అవి కాకుండా ఆయన చేతిలో దేవర సీక్వెల్ కూడా ఉంది. అందుకే తారక్ ఇప్పుడు తన లైనప్ తో యమా బిజీగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
