Begin typing your search above and press return to search.

తారక్ జిమ్ వర్కౌట్ వీడియో ఔట్.. ఏంది సామీ ఆ డెడికేషన్

తాజాగా ఆయన జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన జనాలు.. తారక్ డెడికేషన్ వేరే లెవెల్ అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Sept 2025 8:02 PM IST
తారక్ జిమ్ వర్కౌట్ వీడియో ఔట్.. ఏంది సామీ ఆ డెడికేషన్
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రాన్స్ ఫార్మేన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ దే. యమదొంగ సినిమా నుంచి ఆయన సినిమా సినిమాకు ట్రాన్స్ ఫార్మేషన్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇక టెంపర్ తర్వాత వేలే లెవెల్. అక్కడ్నుంచి తారక్ ఇంకో లెవెల్ లో డెడికేషన్ చూపిస్తున్నారు. గతేడాది రిలీజైన దేవరలో కాస్త బరువుగా కనిపించిన తారక్.. ఆ సినిమా తర్వాత సన్నగా అయిపోయారు.

ఆ మధ్య సినిమా ఫంక్షన్లు, వార్ 2 ప్రమోషన్స్ లో సన్నగా కనిపించారు. ప్రస్తుతం భారీ అంచనాలతో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా కోసమే కొత్త లుక్ అని ప్రచారంలో ఉంది. ఈ లుక్ ల సన్నగా ఫుల్ ఫిట్ గా కనిపిస్తున్నారు. దీంతో అప్పట్లో అభిమానులు షాక్ అయ్యారు. దేవర తర్వాత నెక్ట్స్ లెవెల్ ట్రాన్స్ ఫార్మేషన్ అని ఆశ్చర్యపోయారు.

తాజాగా ఆయన జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన జనాలు.. తారక్ డెడికేషన్ వేరే లెవెల్ అంటున్నారు. జిమ్ లో ఆయన బ్యాక్ సైడ్ రోప్ తో హెవీ వర్కౌట్ చేస్తున్నారు. ఇందులో షర్ట్ లెస్ లుక్ లో తారక్ బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఆయన పర్సనల్ జిమ్ ట్రైనర్ కుమార్ మన్నవా ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

అంతే ఒక్కసారిగా వీడియో వైరల్ అయ్యింది. మాస్ లుక్ లో తారక్ అరాచకం అంటూ నందమూరీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. నిజంగా దేవర నుంచి వార్ 2 విక్రమ్ దాకా మళ్లీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ వేలే లెవెల్ లో కష్టపడుతున్నారు. ఇక వీడియోలో గమనించినట్లైతే.. తారక్ భుజానికి ఆంకర్ సింబల్ టాటూ ఉంది. అయితే అది ఒరిజినలా లేదా డ్రాగన్ సినిమా కోసం టెంపరరీగా వేసిందా అన్నది నెటిజన్లలో మరో సందేహం నెలకొంది.

కాగా, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా తెరక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ రోల్ ఫుల్ పవర్ ఫుల్గా ఉంటుందని టాక్. అందుకే తారక్ జిమ్ లో ఇన్ని కసరత్తులు చేస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ డెడికేషన్ కు మాత్రం హాట్సాఫ్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో రుక్మిణీ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా సంయుక్తంగా రూపొందుతోంది. 2026 జూన్ 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.