వార్ 2 రెస్పాన్స్ పై తారక్ ఏమన్నారంటే!
జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వార్ 2 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది.
By: M Prashanth | 16 Aug 2025 5:02 PM ISTజూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వార్ 2 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజైంది. ఈ క్రమంలోనే హీరో ఎన్టీఆర్ సినిమాను ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు.
వార్ 2 పై మీకున్న ప్రేమను నేను చూస్తున్నాను. దానికి నేనూ మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నాను. ఎంతో ప్యాషన్‌తో నిర్మించిన మా చిత్రానికి ప్రేక్షకుల మద్దతు లభించడం ఆనందంగా ఉంది. అని ఎన్టీఆర్ ఎమోషనల్ నోట్ ను సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తారక్ పోస్టు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండిగ్ లోకి దూసుకొచ్చింది. ఫ్యాన్స్ అందరూ సినిమాలో ఎన్టీఆర్ నటున, యాక్షన్ సీక్వెన్స్, బిగ్ స్క్రీన్ పై హృతిక్ తో పోటీ పడడం ఇలా అన్న బాగున్నాయంటూ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఎన్టీఆర్ నటనను మెచ్చుకుంటున్నారు. వెండితెరపై ఆయన ఎనర్జీ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. దీంతో వార్ 2, ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే హ్యాష్ ట్యాగ్ లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. ప్రస్తుతం సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేయడం, సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించేందుకు ఉపయోగపడుతుంది.
కాగా, భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా తొలి రెండు రోజుల్లో కలిపి దేశీయంగా రూ.108.35 కోట్లు (నెట్) రాబట్టింది. తొలి రెండు రోజుల్లో ఓవర్సీస్ లో రూ.79 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇవాళ రేపు వీకెండ్ కాబట్టి, వసూళ్లు ఇంకా పేరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఈ వసూళ్ల లెక్కల గురించి కూడా త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఈ సినిమా 2019 బ్సాక్ బస్టర్ వార్ కు సీక్వెల్ గా వచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇది రూపొందింది. ఎన్టీఆర్, హృతిక్ కీ రోల్స్ లో నటించగా.. కియారా అద్వాణీ కీలక హీరోయిన్ గా నటించింది. యశ్ రాజ్ ఫిల్మ్ సంస్థ దాదాపూ రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించింది.
