మరోసారి ఎన్టీఆర్ మేకోవర్.. ఎందుకంటే
ఎన్టీఆర్ తన కెరీర్లో మునుపెన్నడూ లేనంత స్లిమ్ గా ఈ సినిమా కోసం మారగా ప్రశాంత్ నీల్ ఈ లుక్ లో ఎన్టీఆర్ ను నెక్ట్స్ లెవెల్ లో చూపించనున్నట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 18 Jun 2025 8:00 PM ISTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తనను తాను చాలా కొత్తగా మేకోవర్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ తన కెరీర్లో మునుపెన్నడూ లేనంత స్లిమ్ గా ఈ సినిమా కోసం మారగా ప్రశాంత్ నీల్ ఈ లుక్ లో ఎన్టీఆర్ ను నెక్ట్స్ లెవెల్ లో చూపించనున్నట్టు తెలుస్తోంది.
ఎప్పుడూ బొద్దుగా కనిపించే, ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం చాలా బరువు తగ్గాడు. ఎన్టీఆర్ ఇంత స్లిమ్ అవడాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ మరోసారి మేకోవర్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అయితే అది నీల్ సినిమా కోసం కాదు, నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే త్రివిక్రమ్ సినిమా కోసం.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందూ పురాణాల్లో పెద్దగా ప్రాచుర్యం పొందని దేవుళ్లలో ఒకరైన కుమారస్వామికి సంబంధించిన కథగా తెరకెక్కబోతున్నట్టు నిర్మాత నాగ వంశీ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలోని పాత్ర కోసం ఎన్టీఆర్ మరోసారి మేకోవర్ కావాల్సిన అవసరం ఉంది.
కథలో భాగంగా ఎన్టీఆర్ భారీ శరీరంతో, స్థూలంగా కనిపించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ మరోసారి మేకోవర్ అవాల్సి ఉంటుందంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆల్రెడీ చాలా బరువు తగ్గిన ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో చేసే సినిమా కోసం మళ్లీ ఫిజికల్ ట్రాన్‌ఫర్మేషన్ చేయాల్సి ఉంది. కాగా గతంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేసిన అరవింద సమేత సినిమా కోసం కూడా భారీ గా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండగా, ఈ సినిమా కోసం కూడా ఎన్టీఆర్ మేకోవర్ కాబోతున్నాడు. ఈ మిథికల్ స్టోరీలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అని చూడ్డానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
