జూనియర్ కోసం ఎన్టీఆర్..!
ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ పాల్గొనడం ద్వారా సినిమా స్థాయి తెలుగు మార్కెట్‌లో ఖచ్చితంగా డబుల్ అవుతుందని విశ్లేషకులు, సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 13 July 2025 4:46 PM ISTయంగ్ హీరోల సినిమాల ఫంక్షన్స్‌కు స్టార్ హీరోలు హాజరు కావడం కామన్‌గా చూస్తూ ఉంటాం. ఎన్టీఆర్ ఎంతో మంది హీరోల సినిమాల ఫంక్షన్స్‌కు హాజరు కావడం మనం చూస్తూ ఉంటాం. త్వరలో మరో కొత్త హీరో సినిమా వేడుకకి ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడు. కన్నడ, తెలుగులో రూపొందిన 'జూనియర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో జరగబోతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి టాలీవుడ్ నుంచి ముఖ్య గెస్ట్‌గా ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడని, అంతే కాకుండా ప్రముఖ దర్శకుడు సైతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
బెంగళూరులో జరగబోతున్న జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్‌ను ఆహ్వానించిన యూనిట్ సభ్యులు తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ బాధ్యతను ఎన్టీఆర్ మీద పెట్టినట్లుగా తెలుస్తోంది. గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన జూనియర్ సినిమాను ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన వైరల్ వయ్యారి పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ పాల్గొనడం ద్వారా సినిమా స్థాయి తెలుగు మార్కెట్‌లో ఖచ్చితంగా డబుల్ అవుతుందని విశ్లేషకులు, సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గాలి జనార్థన్ రెడ్డి ఫ్యామిలీ హీరో కావడంతో కన్నడంతో తెలుగు రాష్ట్రాల్లో కిరీటి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగు వారికి సుపరిచితుడు గాలి జనార్థన్ రెడ్డి. అందుకే కిరీటి సినిమాకు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ప్రేక్షకులు సైతం జూనియర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూనియర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూడటానికి మరో కారణం ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కావడం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ను ఆహ్వానించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఖచ్చితంగా ఈ సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
జూనియర్ హీరో కిరీటికి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానమట. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ను ఆహ్వానించాలని భావించాడు. ఎన్టీఆర్ రాకతో ఖచ్చితంగా సినిమాకు హైప్ రావడంతో పాటు, తన ఫ్యాన్ మూమెంట్ ఫుల్ ఫిల్ అవుతుందని కిరీటి భావిస్తున్నాడట. జూనియర్ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కెరీర్ మొదట్లోనే కన్నడ, తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒకే సారి వచ్చేందుకు సిద్ధం అయిన కిరీటి ఖచ్చితంగా భవిష్యత్తులో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడేమో చూడాలి. జూనియర్ సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్ నేపథ్యంలో ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
