Begin typing your search above and press return to search.

వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్..ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతంటే?

ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్' ముందు వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు.

By:  Madhu Reddy   |   11 Aug 2025 10:06 AM IST
వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్..ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతంటే?
X

ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్' ముందు వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు. ముఖ్యంగా జపాన్ దేశంలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఇకపోతే తన ఉనికిని విస్తరించుకోవడానికి ఇప్పుడు పలు భాషలలో నేరుగా సినిమాలు చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ కథానాయకగా.. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలు విడుదలయ్యాయి. ఈ సినిమాపై మరింత బజ్ పెంచడానికి నిన్న హైదరాబాదులోని యూసఫ్ గూడా వేదికగా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈవెంట్ రాత్రి సుమారుగా 11 గంటల వరకు సాగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్ హైలెట్గా నిలిచింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబినేషన్ పై ప్రశంసలు కురిపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. అలా ఈ ఈవెంట్లో ఎవరికి వారు హైలైట్ అయ్యే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మరొకసారి తన లగ్జరీని చూపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇకపోతే ఈ ఈవెంట్ కి బ్లాక్ అండ్ బ్లాక్ స్టైలిష్ లుక్ లో వచ్చిన ఎన్టీఆర్.. తన లుక్ ను మరింత హైలెట్ చేస్తూ బ్లాక్ కలర్ రిస్ట్ వాచ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. బ్లాక్ కలర్ బెల్ట్.. గోల్డెన్ కలర్ డయల్ తో చాలా స్టైలిష్ గా కనిపించిన ఈ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు దాని ధర ఎంత అని తెలుసుకోవడానికి అభిమానులు కూడా తెగ గూగుల్ సర్చ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ వాచ్ ఖరీదు తెలిసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వాచ్ ఆడమర్స్ పిగెట్ రాయల్ ఓక్ డబుల్ బ్యాలెన్స్ వీల్ బ్లాక్ సిరామిక్ ఓపెన్ వర్క్ డయల్ లిమిటెడ్ ఎడిషన్ కి సంబంధించిన వాచ్.. దీని ఖరీదు మార్కెట్ ప్రకారం అక్షరాల రూ.3.37 కోట్లు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ కి వాచ్ లు అంటే చాలా ఇష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించిన ఈయన తన చేతికి రిచర్డ్ మిల్లే మెక్ లారెన్ స్పీడ్ టెయిల్ వాచ్ ధరించారు. దీని ఖరీదు అక్షరాల 8 కోట్ల 60 లక్షలు పైగానే ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు కోట్లు విలువ చేసే వాచ్లు ధరిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.