Begin typing your search above and press return to search.

'మ‌మ మ‌మ మ‌హేషా' సింగ‌ర్‌పై వేధింపులు?

'మ‌మ మ‌మ మ‌హేషా..' అంటూ 'స‌ర్కార్ వారి పాట' సినిమా కోసం పాడింది జోనితా గాంధీ. ఈ భామ ప్రారంభం కొన్ని సింగిల్ ఆల్బ‌మ్స్ తో పేరు తెచ్చుకుని, ఆ త‌ర్వాత బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల‌కు పాడుతోంది.

By:  Tupaki Desk   |   16 Jun 2025 8:00 AM IST
మ‌మ మ‌మ మ‌హేషా సింగ‌ర్‌పై వేధింపులు?
X

'మ‌మ మ‌మ మ‌హేషా..' అంటూ 'స‌ర్కార్ వారి పాట' సినిమా కోసం పాడింది జోనితా గాంధీ. ఈ భామ ప్రారంభం కొన్ని సింగిల్ ఆల్బ‌మ్స్ తో పేరు తెచ్చుకుని, ఆ త‌ర్వాత బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల‌కు పాడుతోంది. అయితే జోనిత తాజా ఇన్ స్టా పోస్ట్ లో త‌న‌ను కొంద‌రు తీవ్రంగా వేధిస్తూ ట్రోల్ చేసార‌ని ఆవేద‌న చెందింది. జోనితా గాంధీ కొంద‌రు ఆక‌తాయిలు D**k ఫోటోపై తన ముఖాన్ని ఉంచి ట్రోల్ చేశారని.. కొన్నిసార్లు ఈవెంట్‌లో తాగిన వ్య‌క్తులు త‌న‌తో డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించారని ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు.

వాట్ ఝుమ్కా, దిల్ కా టెలిఫోన్ వంటి హిట్ నంబ‌ర్ల‌తో జోనితా గాంధీ పేరు మార్మోగింది. ఈ భామ అంద‌చందాలు, హుషారైన గాత్రానికి భారీగా అభిమానులున్నారు. జోనితా గాంధీ ఇటీవల ఆన్‌లైన్‌లో ఒకరి ప్రైవేట్ పార్ట్ ఫోటోను త‌న ముఖంపై ఉంచార‌ని అది త‌న‌ను చాలా క‌ల‌త‌కు గురి చేసింద‌ని చెప్పారు. ఇలాంటి వ్య‌క్తుల‌ను సోష‌ల్ మీడియాల్లో బ్లాక్ చేసినా కానీ, వాటిని తన తల్లి సోషల్ మీడియా పేజీలో చూస్తుందని తాను ఆందోళన చెందుతున్నానని కూడా తెలిపింది.

నేను ఇలాంటి వాటిని విస్మ‌రిస్తాను. కానీ నా త‌ల్లి అలాంటివి చూసి క‌ల‌త చెందుతుంద‌ని జోనితా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప‌ని లేని వాళ్లు చేసే అస‌హ్య‌క‌ర‌మైన ప‌నులు ఇవ‌న్నీ అంటూ ఘాటుగా విమ‌ర్శించారు. కొన్నిసార్లు నాతో పాటు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తార‌ని అలాంటి వారిపై నేను వ్యంగ్యంగా స్పందిస్తాన‌ని కూడా జోనిత అన్నారు. అయితే బాగా తాగి ఉండ‌టం వ‌ల్ల వాటిని వారు అర్థం చేసుకోలేరు అని కూడా వ్యాఖ్యానించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... జోనిత గాయ‌నిగా తన కెరీర్‌లో కొన్ని అతిపెద్ద పార్టీ హిట్‌లతో అల‌రించింది. వాటిలో వాట్ జుమ్కా, సోని సోని, ది బ్రేకప్ సాంగ్, దిల్ కా టెలిఫోన్ ఇన్ స్టంట్ గా హిట్ సాధించాయి. జోనితా గాంధీ పాట న‌యా షేర్ లో విరాట్ కోహ్లీ కూడా క‌నిపించ‌నుండ‌డం ఆస‌క్తిక‌రం.