పిరుదుల దిగువకు దుస్తులు.. కేన్స్ 2025లో వింత!
కేన్స్ 2025 చాలా సాదాసీధాగా కనిపిస్తోంది. స్టార్లు వస్తున్నారు వెళుతున్నారు! కానీ ఆశించిన వెరైటీ ఏదీ కనిపించలేదు.
By: Tupaki Desk | 20 May 2025 11:08 PM ISTకేన్స్ 2025 చాలా సాదాసీధాగా కనిపిస్తోంది. స్టార్లు వస్తున్నారు వెళుతున్నారు! కానీ ఆశించిన వెరైటీ ఏదీ కనిపించలేదు. ప్రయోగాలు అసలే లేవు. పైగా అసభ్యత అస్సలు కనిపించకూడదని, పొడవాటి నేలపై జారే దుస్తులు ధరించకూడదని కండీషన్ అప్లయ్ చేయడంతో చాలా మంది డిజైనర్లు ప్రయోగాలకు పోలేదు. దీంతో ఈసారి కేన్స్ వేదిక నిజంగా కళ తప్పింది.
అయితే ఇలాంటి నీరసం తెప్పించే షోలో ఒక జుగుప్స కలిగించే కామెడీ షో. నటుడు జోనాథన్ ధరించిన దుస్తులు ఇప్పుడు చర్చగా మారాయి. అతడి పిరుదుల కిందకు జారిపోతున్న ఆ దుస్తుల్ని సరి చేసుకోకుండా, అలాగే ఎండుటాకులు కొన్ని చుట్టుకుని వీటిని ఫ్యాషన్ సెన్స్ అని వ్యంగ్యంగా రెడ్ కార్పెట్ పై ప్రదర్శించేందుకు ప్రయత్నించిన జోనాథన్ గిల్హెర్మ్ వేదిక వద్ద కొందరిని నవ్వించినా కానీ, అది నెటిజనులకు జుగుప్సగా కనిపించింది.
`ఐ ఓన్లీ రెస్ట్ ఇన్ ది స్టార్మ్` స్టార్ జోనాథన్ గిల్హెర్మ్ ఈవెంట్లో తన సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో నగ్నత్వాన్ని నిషేధించిన నిర్వాహకులు కొత్త డ్రెస్ కోడ్ నిబంధనలను అమలు చేసినప్పటికీ గిల్హెర్మ్ తన వెనుక భాగాన్ని పిరుదులను చూపించి ఆశ్చర్యపరిచాడు. కేన్స్‌లో జోనాథన్ గిల్హెర్మ్ బేర్ బట్ తో అరంగేట్రం చేయడం ఆశ్చర్యపరిచింది. ఇటీవలి కొన్నేళ్లలో రెడ్ కార్పెట్‌పై దాదాపు నగ్నంగా ప్రదర్శనలు సాగాయి. కానీ ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. దీంతో వేదిక నిజంగా డ్రైగా కనిపిస్తోంది.
అతిథుల ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించేవి.. థియేటర్‌లో కూర్చోవడానికి ఇబ్బంది కలిగించే భారీ దుస్తులు, ముఖ్యంగా పెద్ద రైలులా పొడవాటి దుస్తులు అనుమతించబడవు. అసభ్యతను అనుమతించము. నియమాలను గౌరవించని ఎవరికైనా రెడ్ కార్పెట్ యాక్సెస్‌ను నిషేధించాల్సిన బాధ్యత నిర్వాహకులకు ఉంది! అని ముందే హెచ్చరించారు. అయితే ఈ నియమాలను ఉల్లంఘించి జోనాథన్ గిల్హెర్మ్ కాసేపు నవ్వించే ప్రయత్నం చేసాడు.
జోనాథన్ గిల్హెర్మ్ పోర్చుగీస్ చిత్రనిర్మాత పెడ్రో పిన్హో దర్శకత్వం వహించిన చిత్రం `ఐ ఓన్లీ రెస్ట్ ఇన్ ది స్టార్మ్`లో నటించాడు. ఈ చిత్రం ``పశ్చిమ ఆఫ్రికాలో తెల్లవాడిగా జీవించటం ఎంత కష్టమో ఈ మూవీ తెరపై ఆవిష్కరిస్తుంది. ఈ పోర్చుగీస్ చిత్రంలో గిల్హెర్మ్ స్వేచ్ఛాయుతమైన, విచిత్రమైన బ్రెజిలియన్ వ్యక్తి గుయ్ అనే పాత్రను పోషించాడు.
