సినిమాతో ఫేమస్ అయిన పల్లెటూరు
ఇక అసలు విషయానికొస్తే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన అప్‌కమింగ్ మూవీ జాలీ ఎల్ఎల్‌బీ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజస్థాన్ లోని ఓ చిన్న గ్రామంలో జరిగింది.
By: Tupaki Desk | 21 July 2025 6:00 PM ISTసినిమా మంచినీ చెప్పగలదు, చెడునూ చూపించగలదు. సినిమాలు చూసి కొందరు అందులోని మంచిని మాత్రమే గ్రహిస్తే, మరికొందరు చెడును తీసుకుని మంచిని వదిలేసి చెడ్డ దోవలోకి వెళ్తూ ఉంటారు. ఇంకొందరు వాటన్నింటినీ పట్టించుకోకుండా హీరో డ్రెస్సింగ్, హీరోయిన్ ఎలాంటి నగలు వేసుకుంది? ఈ లొకేషన్ ఎక్కడ అంటూ ఆరాలు తీస్తూ ఉంటారు.
కొన్నిసార్లు సినిమాల కంటే అవే ఫేమస్ అవుతూ ఉంటాయి. మరికొన్ని సార్లు ఆ ప్రదేశాల్లో షూటింగ్ జరగడం వల్ల ఆ లొకేషన్ చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడలానే ఓ లొకేషన్ బాగా ఫేమస్ అయింది. అదే రాజస్థాన్ లోని ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఓ సినిమాను తీశారు. అయితే అక్కడ తీసిన మూవీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఆ ఊరు బాగా ఫేమస్ అయిపోయింది.
ఇక అసలు విషయానికొస్తే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన అప్‌కమింగ్ మూవీ జాలీ ఎల్ఎల్‌బీ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజస్థాన్ లోని ఓ చిన్న గ్రామంలో జరిగింది. సినిమాలోని ఎక్కువ సీన్స్ ను ఆ ఊరిలోనే షూట్ చేయడంతో ఆ ఊరు ఇప్పుడొక పాపులర్ టూరిస్ట్ ప్లేస్ లా మారింది. జాలీ ఎల్ఎల్‌బీ3 ఇంకా రిలీజవక పోయినప్పటికీ ఆ ఊరు మాత్రం ఇప్పటికే బాగా పాపులరైంది.
ఆ ఊరులో చాలానే ప్రత్యేకతలున్నాయి. 2025 వచ్చినా ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ 1947 కాలంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికీ ఆ గ్రామస్థులు పెంకుటిళ్లు, భవంతుల్లో కాకుండా పూరిళ్లల్లోనే ఉంటారు. అలాంటి ఊరిలో జాలీ ఎల్ఎల్‌బీ షూటింగ్ జరగడంతో ఆ గ్రామానికి మరింత ఆదరణ పెరిగింది. సినిమాలోని ఎక్కువ షూటింగ్ ను అక్కడ చేయడమే కాకుండా ఆ ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులు కూడా ఈ సినిమాలో నటించారు.
ఇక సినిమా విషయానికొస్తే ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ లో రెండు సినిమాలు రాగా మూడో భాగంగా రానున్న జాలీ ఎల్ఎల్‌బీ3 పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో అర్షద్ వార్సీ, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తుండగా, సెప్టెంబర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటినుంచే ఈ సినిమాపై భారీ అంచనాలుండటంతో అన్నీ అనుకున్నట్టు జరిగితే జాలీ ఎల్ఎల్‌బీ3 బాక్సాఫీస్ వద్ద రూ.230 కలెక్ట్ చేసే ఛాన్సుంది.
