Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్ కోసం జాన్ అబ్ర‌హం అన్న‌వ‌న్నీ మ‌ర్చిపోయాడా?

ఆర్ సీ 16 లో బాలీవుడ్ న‌టుడు జాన్ అబ్ర‌హం న‌టిస్తున్న‌ట్లు ఓ వార్త వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Feb 2024 10:30 AM GMT
రామ్ చ‌ర‌ణ్ కోసం జాన్ అబ్ర‌హం అన్న‌వ‌న్నీ మ‌ర్చిపోయాడా?
X

ఆర్ సీ 16 లో బాలీవుడ్ న‌టుడు జాన్ అబ్ర‌హం న‌టిస్తున్న‌ట్లు ఓ వార్త వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఓకీల‌క మైన పాత్ర కోసం ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ముంబైలో జాన్ కి స్టోరీ వినిపించిన‌ట్లు..ఆయ‌న కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. క్రేజీ న‌టుడ జాన్ ఇమేజ్ ఆధారంగా అత‌డితో క‌చ్చితంగా నెగిటివ్ రోల్ చేయించ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ లో విజ‌య్ సేతుప‌తి... శివ‌రాజ్ కుమార్ లాంటి స్టార్లు యాడ్ అవ్వ‌డంతో అంచ‌నాలు పీక్స్ కి చేరాయి.

తాజాగా జాన్ అబ్ర‌హం కూడా రంగంలోకి దిగితే ఎలా ఉంటుంద‌న్నది? చెప్పాల్సిన ప‌నిలేదు. తాజా సినారేలో బాలీవుడ్ న‌టులంతా తెలుగు సినిమాల్లో భాగ‌మ‌వ్వ‌డంతో వాటి రేంజ్ అంత‌కంత‌కు పెరుగు తుంది. రెండు భాషల న‌టుల మ‌ధ్య మంచి ప్రెండ్ షిప్ కూడా బిల్డ్ అవుతుంది. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే జాన్ అబ్ర‌హం గ‌తంలో చేసిన కొన్ని వ్యాఖ్య‌లు మ‌ళ్లీ చ‌ర్చ‌కొస్తున్నాయి. గ‌తంలో జాన్ అబ్ర‌హం న‌టించిన హిందీ చిత్రంతో ఓ సౌత్ సినిమా క్లాష్ అయింది.

ఆ స‌మ‌యంలో సౌత్ సినిమాపై ఆయ‌న సెటైరికల్ గా స్పందించారు. తాను కేవ‌లం హిందీ హీరోని మాత్ర‌మేన‌ని..సౌత్ తో నాకేంటి సంబంధం అన్న‌ట్లు..త‌న సినిమానే గొప్ప‌గా చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసారు. ఈ నేప‌థ్యంలో బుచ్చిబాబు సినిమాలో జాన్ అబ్ర‌హం నటిస్తున్నాడ‌నే వార్త పై ర‌క‌ర‌కాల అంశాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. అప్పుడు సౌత్ సినిమాల గురించి కించి ప‌రిచిన‌ట్లు వ్యాఖ్యానించిన జాన్ అబ్ర‌హం ఇప్పుడు అదే సౌత్ సినిమా పై పాజిటివ్ గా ఉండ‌టం ఏంటి? ఆ నాడు చేసిన వ్యాఖ్య‌లు జాన్ అబ్ర‌హం మ‌ర్చిపోయాడా? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటి జ‌నులు గుర్తు చేస్తున్నారు.

మ‌రి ఈ విష‌యం బుచ్చిబాబుకి తెలుసా? లేదా? అన్న‌ది తెలియాల్సిన అంశం. కొన్ని పాత్ర‌లకు కొంద‌రు న‌టులు మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని మేక‌ర్స్ బ‌లంగా న‌మ్ముతారు. అందుకోసం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఒప్పిస్తుంటారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎన్నో చూసాం. బుచ్చిబు కూడా అలాంటి మొండి వాడే. మ‌రి జాన్ అబ్ర‌హంని అలా మొండిగా ఒప్పించాడా? ఈ మొత్తం ప్ర‌చారం వెనుక వాస్త‌వం ఏంటి? అన్న‌ది క్లారిటీ రావాలంటే? అస‌లు వ్యక్తులు తెర‌పైకి రావాలి. అప్పుడే ఈ సందేహాల‌న్నింటికీ పుల్ స్టాప్ ప‌డే అవ‌కాశం ఉంటుంది.