Begin typing your search above and press return to search.

ఆర్ సీ 16 లో జాన్ అబ్ర‌హం!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ సినిమా ప‌న‌లు బుచ్చిబాబు స్పీడ‌ప్ చేసిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Feb 2024 1:30 AM GMT
ఆర్ సీ 16 లో జాన్ అబ్ర‌హం!
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ సినిమా ప‌న‌లు బుచ్చిబాబు స్పీడ‌ప్ చేసిన సంగ‌తి తెలిసిందే. `గేమ్ ఛేంజ‌ర్` షూట్ తో సంబంధం లేకుండా చ‌ర‌ణ్ ఈ సినిమాని కిక్ స్టార్ట్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో బుచ్చిబాబు కూడా అంతే యాక్టివ్ గా ప‌నిచేస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ చ‌ర‌ణ్ నుంచి క్లియ‌రెన్స్ రాక పోవ‌డంతో ప‌నుల‌న్నీ న‌త్త‌న‌క‌డ‌న న‌డిచాయి. కానీ చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డంతో బుచ్చిబాబు కూడా అంతే యాక్టివ్ గా ప‌నిచేస్తున్నాడు.

దీనిలో భాగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మ‌రింత వేగంగా జ‌రుగుతున్నాయి. న‌టీన‌టులు..సాంకేతిక నిపుణులు ఎంపిక వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ కి జోడీగా జాన్వీక‌పూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అలాగే ప్ర‌తి నాయ‌కుడిగా విజ‌య్ సేతుప‌తిని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా కొన్ని కీల‌క పాత్ర‌ల‌కు పేరున్న న‌టుల్ని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఓ పాత్ర‌కి సంబం ధించి ఇంట్రెస్టింగ్ విష‌యం ఒక‌టి వైర‌ల్ అవుతోంది.

సినిమాలో ఓ కీల‌క పాత్ర‌కి బాలీవుడ్ న‌టుడు జాన్ అబ్ర‌హంని తీసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు మెగా కాపౌండ్ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. ఇటీవ‌లే బుచ్చిబాబు ముంబైలో జాన్ అబ్ర‌హంని క‌లిసిన‌ట్లు కాంపౌండ్ నుంచి లీకైంది. అయితే జాన్ ఒకే చేసాడే? లేదా? అన్న‌ది మాత్రం తెలియ‌దు. కేవ‌లం ఇద్ద‌రి మ‌ధ్య స్టోరీ స‌హా పాత్ర‌కి సంబంధించిన డిస్క‌ష‌న్ మాత్ర‌మే జ‌రిగిందంటున్నారు. అంటే జాన్ నుంచి క్లియ‌రెన్స్ రావాల్సి ఉంద‌ని తెలుస్తోంది.

చ‌ర‌ణ్ సినిమాలో జాన్ అబ్ర‌హం న‌టిస్తే నిజంగా ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. బాలీవుడ్ లో నే పేరున్న న‌టుడు. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోతాడు. పాజిటివ్..నెగిటివ్ రోల్ ఏదైనా వ‌న్నె తేగ‌ల న‌టుడు. అలాంటి న‌టుడుకి చ‌ర‌ణ్ కి ధీటుగా ఉండే బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ న‌టుల హ‌వా సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. బాబి డియోల్..సైఫ్ అలీఖాన్.. ఇమ్రాన్ హ‌ష్మీ లాంటి పేరున్న న‌టులే తెలుగు సినిమాల్లో హైలైట్ అవుతున్నారు. వాళ్ల ఎంట్రీతో ఆ సినిమాల‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ వ‌స్తుంది.