Begin typing your search above and press return to search.

70 కోట్ల‌కు పాత భ‌వంతి కొన్న హీరో

బాలీవుడ్ స్టార్ జాన్ అబ్ర‌హం క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో ఎంత మంది హీరోలున్నా? జాన్ అంటే ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 11:34 AM GMT
70 కోట్ల‌కు పాత భ‌వంతి కొన్న హీరో
X

బాలీవుడ్ స్టార్ జాన్ అబ్ర‌హం క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో ఎంత మంది హీరోలున్నా? జాన్ అంటే ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తున్నాడు. హీరోగా..విల‌న్ గా...క్యారెక్ట‌ర్ ఆర్ట‌స్ల్ గా జాన్ సంచ‌నాల గురించి తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో విల‌న్ పాత్ర‌ల‌తో మ‌రింత ఫేమ‌స్ అవుతున్నాడు. ఇటీవ‌లే ప‌ఠాన్ లోనూ విల‌న్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.


బాలీవుడ్ బిజీ న‌టుల్లో ఒక‌డిగా జాన్ ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతున్నాడు. ఇక బ్రాండ్స్ ని ఎండార్స్ చేయ‌డంలో జాన్ అబ్ర‌హం ముందుటాడు. ఎలాంటి ప్ర‌క‌ట‌న విడిచి పెట్ట‌డు. అలా న‌టుడిగా..బ్రాండ్ అంబాసిడ‌ర్ గా రెండు ర‌కాల ఆదాయాలు అందుకుంటున్నాడు. తాజాగా జాన్ అబ్ర‌హం ఏడు వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ బంగ్లాని 75 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది.

డిసెంబ‌ర్ 27న ఈ డీలింగ్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. బంగ్లా కోసం 70.8 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా స్టాంప్ డ్యూటీ కోసం అద‌నంగా 4.25 కోట్లు వెచ్చించిన‌ట్లు స‌మాచారం. ముంబైలోని ఖ‌ర్ లింకింగ్ రోడ్డులో ఈ భ‌వంతి ఉంది. అయితే ఇది పాత భ‌వంతి అని తెలుస్తోంది. ప్ర‌స్తుత దాని మార్కెట్ విలువ ప్ర‌కార‌మే జాన్ అబ్ర‌హం ఆ భ‌వంతిని అన్నికోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. పాత భ‌వంతుల్ని ఆధునీక‌రించి త‌మ‌కు కావాల్సిన విధంగా తీర్చి దిద్దుకుంటున్నారు.

అప్ప‌టి క‌ట్ట‌డాలు ఎంతో ప‌టిష్టంగా ఉండేవి. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ లో చాలా మంది స్టార్లు పాత భ‌వంతుల్లోనే ఇప్ప‌టికీ ఉంటున్నారు. క‌పూర్ వార‌సులు గానీ...ఖాన్ లు గానీ వీళ్లంతా కొత్త అపార్టు మెంట్ ల్లో ఉంటున్నా వార‌సత్వంగా వ‌స్తోన్న పాత భ‌వంతులు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. వాటిని త‌మ అభిరుచుకి అనుగుణంగా మార్చుకుని అద్దెకిస్తున్నారు. లేదా? తల్లిదండ్రులు..తాత‌నాయ‌న‌మ్మ‌లు వాటిలో ఉండేలా చూసుకుంటున్నారు. జాన్ అబ్ర‌హం 70 కోట్లు పెట్టాడంటే ఆ భ‌వంతి డిజైన్ లో చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉండే అవ‌కాశం ఉంటుంది.