Begin typing your search above and press return to search.

'జాన్ విక్ 5'మ‌రో లెవ‌ల్లో.. కీనూరీవ్స్ రీఎంట్రీ?

జాన్ విక్ మరణంతో అతడి క‌థకు తెరప‌డ‌టంతో, చాప్టర్ 4 లో దాని స్పిన్‌ఆఫ్‌లకు ప్లాన్ చేసార‌ని అర్థ‌మ‌వుతోంది.

By:  Tupaki Desk   |   14 March 2025 2:00 AM IST
జాన్ విక్ 5మ‌రో  లెవ‌ల్లో.. కీనూరీవ్స్ రీఎంట్రీ?
X

హాలీవుడ్‌లో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్, థ్రిల్ల‌ర్ సిరీస్ 'జాన్ విక్' ప్ర‌పంచ‌వ్యాప్తంగా అద్భుత‌మైన ఆద‌ర‌ణ‌ను పొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు భాగాలుగా విడుద‌లైన ఈ ఫ్రాంఛైజీ డాల‌ర్ల వేట‌లో అలుప‌న్న‌దే లేకుండా అజేయంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు సిరీస్ లో ఐద‌వ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. కీనూ రీవ్స్ ఇప్పుడు ఐదో భాగం కోసం తిరిగి వ‌స్తారా లేదా? అన్న‌ది ప్ర‌స్తుతానికి సస్పెన్స్ గా ఉంది. అత‌డు తిరిగి వ‌స్తాడ‌ని అభిమానులు ఎగ్జ‌యిట్ అవుతున్నారు. జాన్ విక్ 5 స్క్రిప్ట్ డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌ని ప్ర‌ఖ్యాత‌ లయన్స్‌గేట్ అధికారికంగా ధృవీకరించింది.

2014లో నాలుగు సినిమాలతో హిట్‌మ్యాన్ క‌థ‌తో భారీ సిరీస్ 'జాన్ విక్' ప్రారంభ‌మైంది. జాన్ విక్: చాప్టర్ 4 తర్వాత, ఫ్రాంచైజ్ 'ది కాంటినెంటల్: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్‌'తో టెలివిజన్‌లోకి విస్తరించింది. తదుపరి బుల్లితెర‌పై 'ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్: బాలేరినా' జూన్ 6న విడుదల కానుంది. జాన్ విక్ మరణంతో అతడి క‌థకు తెరప‌డ‌టంతో, చాప్టర్ 4 లో దాని స్పిన్‌ఆఫ్‌లకు ప్లాన్ చేసార‌ని అర్థ‌మ‌వుతోంది. జాన్ విక్ సెంట్ర‌ల్ స్టోరీకి ముగింపు ప‌లికార‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ ప్రేక్షకులకు ఇంకా ఆశ ఉన్నట్లు కనిపిస్తోంది.

బాలెరీనా త్వ‌ర‌లో విడుద‌ల‌వుతోంది. ఐదో భాగం నుంచి స్పిన్ ఆఫ్ లు మ‌రో స్థాయికి చేరుకుంటాయి. ఈసారి పెద్ద తెర‌పై ప్ర‌త్యేక‌మైన విజువ‌ల్ ట్రీట్ ఉంటుంద‌ని లైన్స్ గేట్ ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఈ సిరీస్ ఐదో భాగంలో కీనూరీవ్స్ పెద్ద తెర‌కోసం న‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా ఊహిస్తున్నారు. అయితే దీనిని అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. భారీ పోరాటాలు, యాక్ష‌న్, స‌స్పెన్స్, థ్రిల్స్ తో స్పిన్ ఆఫ్ క‌థ‌లు వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.