పోలీస్ బాసులంతా కండల హీరో చుట్టూనే!
పోలీస్ స్టోరీలు ఎన్ని తెరకెక్కినా వాటి ప్రత్యేకతే వేరు. సరైన కటౌట్ కి పోలీస్ స్టోరీ పడిందంటే? తిరుగుం డదు.
By: Tupaki Desk | 3 Sept 2025 5:00 PM ISTపోలీస్ స్టోరీలు ఎన్ని తెరకెక్కినా వాటి ప్రత్యేకతే వేరు. సరైన కటౌట్ కి పోలీస్ స్టోరీ పడిందంటే? తిరుగుం డదు. కోలీవుడ్...టాలీవుడ్ `సింగం` ప్రాంచైజీలా కొనసాగుతూనే ఉంటాయి. కోలీవుడ్ లో సూర్య, బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ కాప్ స్టోరీలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయారు. పోలీస్ నేపథ్యంలో సినిమాలు చేయాలంటే మేకర్స్ కు వాళ్లే హీరోలుగా కనిపిస్తున్నారు. మరో ఆప్షన్ లేకుండా దర్శకులు వాళ్లిద్దరితోనే ముందుకెళ్తున్నారు. కానీ కాప్ స్టోరీలు సెట్ అయ్యే హీరోలు ఇంకా చాలా మంది ఉన్నారు.
కొత్త డైరెక్టర్ తో ముందుకు:
అలాంటి వాళ్లలో మరో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఒకరు. ఏసీపీ యశ్వర్దన్ సింగ్ పాత్రలో జాన్ పోర్స్ సినిమాతో ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. అప్పటి నుంచి `ఫోర్స్` అన్నది ఓ ప్రాంచైజీ గా మారిపోయింది. ఈ ప్రాంచైజీ నుంచి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. తాజాగా `ఫోర్స్ 3`కి రంగం సిద్దమవుతోంది. జాన్ అబ్రహం ఏసీపీ యశ్వర్దన్ సింగ్ పాత్రను బలంగా నమ్మడంతో మరోసారి పోర్స్ ప్రాంచైజీని రీబూట్ చేస్తున్నారు. ఈసారి దర్శకత్వం బాధత్యలు భావ్ దూలియాకు అప్పగించారు.
ఏడాది చివరకల్లా లాంచింగ్:
`ఫోర్స్` ని నిషాకాంత్ కామత్ తెరకెక్కించాడు. ఆ తర్వాత రెండవ భాగాన్ని అభినయ డియో తెరెకెక్కిం చాడు. వీళ్లిద్దర్నీ పక్కన బెట్టి థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ కు కొత్త డైరెక్టర్ భావ్ దూలియాని తెరపైకి తేవడం విశేషం.`పాన్ సింగ్ తోమర్`, `దృశ్యం`, `కాఖీ : ది బిహార్ చాప్టర్` లాంటి మూడు సినిమాలను తెరకె క్కించిన అనుభవం ఉంది. `ది ప్రీ లాన్సర్` లాంటి టీవీ సీరియల్ కూడా డైరెక్ట్ చేసాడు. దర్శకుడిగా అంత బిజీ కాదు. కానీ అతడిపై నమ్మకంతో జాన్ బాధ్యతలు అప్పగించారు. స్క్రిప్ట్ సహా అన్ని పనులు పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఒకే ఏడాది రెండు పోలీస్ స్టోరీలు:
ఇందులో విద్యుత్ జమాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విలన్ పాత్రకు ఓపేరున్న నటుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. పోలీస్...ప్రతి నాయకుడి పాత్రల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. అంతే కాదు జాన్ ఇప్పటికే ఓ పోలీస్ స్టోరీలో నటిస్తున్నాడు. మాజీ ముంబై పోలీస్ అధికారి రాకేష్ మారియా బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కాఫ్ చిత్రాల స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి తెరకెక్కి స్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇలా ఒకే ఏడాది రెండు పోలీస్ స్టోరీల్లో జాన్ నటించడం విశేషం.
