Begin typing your search above and press return to search.

యాత్ర 2 రిస్క్ రోల్.. జీవా షాకింగ్ రియాక్షన్

కోలీవుడ్ హీరో జీవా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ఈ హీరో 'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యాడు

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:30 PM GMT
యాత్ర 2 రిస్క్ రోల్.. జీవా షాకింగ్ రియాక్షన్
X

కోలీవుడ్ హీరో జీవా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ఈ హీరో 'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యాడు. తమిళం తో పాటు తెలుగులోనూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అక్కడి నుంచి ఇతను తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరచుకుంటాడని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. జీవా కెరీర్ లో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ హీరో నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ చేయబడ్డాయి.

కానీ అవేవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడంతో తెలుగులో జీవా మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అయితే చాలా గ్యాప్ తర్వాత తెలుగులో 'యాత్ర 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు జీవా. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన 'యాత్ర' సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇందులో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం, ఏపీ రాజకీయాల్లో వైయస్ జగన్ ఎదిగిన విధానాన్ని, చూపించబోతున్నారు.

అలాగే అప్పట్లో జగన్ చేసిన పాదయాత్రను కూడా ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్ గా చూపించబోతున్నట్లు ఇటీవల రిలీజైన టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ముఖ్యంగా టీజర్ లో హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో చాలా బాగా నటించాడు. జగన్ బాడీ లాంగ్వేజ్ ని అచ్చు గుద్దినట్లు దింపేశాడు. టీజర్ రిలీజ్ అయ్యాక చాలామంది జగన్ పాత్రలో జీవ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడని కామెంట్స్ కూడా చేశారు.

ఏపీ ఎలక్షన్స్ సమయంలో ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలెట్టారు. ఇందులో భాగంగా హీరో జీవా తాజా ఇంటర్వ్యూలో 'యాత్ర 2' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు." నాకు జగనన్న జర్నీ చాలా ఇష్టం. కానీ యాత్ర 2 ఆఫర్ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నా.

జగన్ ప్రభావవంతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి పాత్రలో నటించడం చాలా రిస్క్. ఆ పాత్రకి నేను న్యాయం చేయకుంటే.. నా కెరీర్ పై తీవ్ర ప్రారంభం చూపుతుంది" అని అన్నాడు. దీంతో జీవా చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.