Begin typing your search above and press return to search.

కోలీవుడ్ సినిమా.. ఎంత కష్టమొచ్చిందో..

ఒక్కో టైంలో ఒక్కో చోట సినిమా ఇండస్ట్రీలో కష్టకాలం ఉంటుంది. కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ పూర్తిగా మూతపడ్డాయి

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:42 AM GMT
కోలీవుడ్ సినిమా.. ఎంత కష్టమొచ్చిందో..
X

ఒక్కో టైంలో ఒక్కో చోట సినిమా ఇండస్ట్రీలో కష్టకాలం ఉంటుంది. కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ పూర్తిగా మూతపడ్డాయి. తెరిచిన కూడా సరైన సినిమాలు లేకపోవడంతో వాటిని నడపడం భారంగా మారిపోయింది. రెంట్ లు కూడా కట్టుకోలేని పరిస్థితి వచ్చింది. మెల్లమెల్లగా ఈ కష్టకాలం నుంచి ఎగ్జిబిటర్స్ బయట పడ్డారు. సినిమాల సక్సెస్ రేట్ పెరగడంతో కొంత వరకు పరిస్థితి మారింది.

సినిమా డిజాస్టర్ అయితే ఎంత పెద్ద సినిమా అయితే తీసేస్తున్నారు. అద్దెలు చెల్లించి బలవంతంగా నడిపించే ప్రయత్నం చేయడం లేదు. బాలీవుడ్ లో కూడా థియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ ఇలాంటి టఫ్ టైం పేస్ చేశారు. ఇప్పుడు కోలీవుడ్ వంతు. రీసెంట్ గా తమిళంలో కార్తి జపాన్, లారెన్స్ జిగార్తాండ డబుల్ ఎక్స్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. జపాన్ మూవీ అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ కారణంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని అనుకోవచ్చు.

కాని జిగార్తాండ డబుల్ ఎక్స్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదు. దీంతో కమర్షియల్ ఫెయిల్యూర్ గా జిగార్తాండ డబుల్ ఎక్స్ మూవీ నిలిచింది. కొత్త సినిమా రిలీజ్ అవుతున్న కూడా థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డులు పడటం లేదు. మల్టీప్లెక్స్ లలో అంటే టికెట్ ధరల ప్రభావం ఉందని అనుకోవచ్చు.

కాని బీ,సీ సెంటర్స్ లో కూడా అదే పరిస్థితి ఉంది. కనేసం కలెక్షన్స్ రావడం లేదు. డివైడ్ టాక్ వస్తే రెండో రోజుకే థియేటర్స్ ఖాళీ అయిప్తున్నాయి. దీంతో ఎగిబిటర్లు లబోదిబోమంటున్నారు.కనీసం రెంట్ లకి కూడా కలెక్షన్స్ రాకుంటే థియేటర్స్ నడపడం కష్టం అఅని అంటున్నట్లు బోగట్ట

అయితే సలార్, కెప్టెన్ మిల్లర్, లాల్ సలామ్ సినిమాలతో పరిస్థితి మారుతుందని ఎగిబిటర్లు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాల సక్సెస్ థియేటర్స్ లో ఆడియన్స్ రాప్పించేలా చేస్తాయని భావిస్తున్నారు. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ మూవీస్ అనేసరికి ఒటీటీలో ఎలాగూ వస్తాయి కదా అని థియేటర్స్ లో చూడటానికి అఆక్తి చూపించడం.