స్టార్ హీరో సినిమా డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్
స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చవి చూడటం ఈ మధ్య కాలంలో కామన్ అయింది.
By: Tupaki Desk | 28 March 2025 8:00 PM ISTకరోనా తర్వాత ఇండియాలో ఓటీటీ యాప్స్ ఎక్కువ అయ్యాయి. అలాగే వాటిని చూసే ప్రేక్షకులు సైతం ఎక్కువ మంది అయ్యారు. ఈమధ్య కాలంలో థియేటర్ రిలీజ్ అయిన సినిమాలను చూస్తున్న వారి సంఖ్యతో పోల్చితే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లను చూస్తున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలు సూపర్ హిట్ అయితే తప్ప థియేటర్‌కి వెళ్లి చూసే పరిస్థితి లేదు. యావరేజ్ టాక్ దక్కించుకుంటే ఆ సినిమాకు మినిమం వసూళ్లు వస్తున్న పరిస్థితి లేదు. బాలీవుడ్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చవి చూడటం ఈ మధ్య కాలంలో కామన్ అయింది.
బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఈమధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు సాధించడమే కష్టం అయింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఓపెనింగ్స్ అంతంత మాత్రమే వస్తున్నాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చి, ఇది థియేటర్‌లో చూస్తేనే బాగుంటుంది అనుకుంటే అప్పుడు థియేటర్‌కి వెళ్తున్నారు. అంతే తప్ప యావరేజ్‌గా ఉంటే సినిమాను కనీసం పట్టించుకోవడం లేదు. ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే పెద్ద హీరోల సినిమాలు థియేటర్‌లో విడుదల అయ్యి తీవ్రంగా నిరాశ పరచిన సందర్భాలు ఉన్నాయి. అందుకే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన 'జ్యూయల్ థీఫ్' సినిమాను థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ చేస్తున్నారు.
కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న సిద్దార్థ్ ఆనంద్ నిర్మించిన ఈ సినిమాకు రాబీ గ్రేవాల్, కుకీ గులాటీలు దర్శకత్వం వహించారు. వార్, పఠాన్ వంటి భారీ యాక్షన్ సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులకు అందించిన సిద్దార్థ్ ఆనంద్ నిర్మించిన సినిమా కావడంతో జ్యూయల్ థీఫ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ భయపడుతున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచిన నేపథ్యంలో డైరెక్ట్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయడం శ్రేయష్కరం కాదని భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాను నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 25న ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. రెడ్ సన్ అనే రూ.500 కోట్ల విలువైన డైమండ్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. విలన్ కోసం ఈ డైమండ్‌ను హీరో కొట్టేయాల్సి ఉంటుంది. హీరో డైమండ్ కొట్టేశాడా.. చివరకు ఏమైంది అనేది కథ అంటూ మేకర్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్ చేశారు. ఓటీటీ ద్వారా ఈ సినిమా కచ్చితంగా బిగ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాలో జైదీప్ అహ్లవత్, నికితా దత్తా, కునాల్ కపూర్, రోసానా ఎల్సా స్కుగుగియా, ఉజ్జ్వల్ గౌరహ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.