Begin typing your search above and press return to search.

జెట్ లీ వివాదం: టాలీవుడ్ పెద్దలు పట్టించుకోరా?

సాధారణంగా థియేటర్ల దగ్గర గొడవలు వస్తే అవి చర్చల ద్వారా ముగిసిపోతాయి. కానీ ఇక్కడ వ్యవహారం హద్దులు దాటినట్లు కనిపిస్తోంది.

By:  M Prashanth   |   2 May 2026 3:15 PM IST
జెట్ లీ వివాదం: టాలీవుడ్ పెద్దలు పట్టించుకోరా?
X

సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే పెద్దలు ముందుండి పరిష్కరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో జరుగుతున్న ఒక వివాదాన్ని చూస్తుంటే సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘జెట్ లీ’ సినిమా చుట్టూ ఇప్పుడు తెలంగాణలో పెద్ద వివాదమే నడుస్తోంది. ఒకవైపు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు సాగుతుంటే, మరోవైపు ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషించే పెద్దలు మాత్రం మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది.

సాధారణంగా థియేటర్ల దగ్గర గొడవలు వస్తే అవి చర్చల ద్వారా ముగిసిపోతాయి. కానీ ఇక్కడ వ్యవహారం హద్దులు దాటినట్లు కనిపిస్తోంది. మైత్రీ సంస్థను టార్గెట్ చేస్తూ తెలంగాణలోని ఇతర డిస్ట్రిబ్యూటర్లు ‘జెట్ లీ’ సినిమాను గట్టిగానే అడ్డుకుంటున్నారని టాక్ వస్తోంది. సింగిల్ స్క్రీన్లలో అద్దెకు సంబంధించిన సమస్యలు ఉండటమే కాకుండా, ఇప్పుడు ఏకంగా మల్టీప్లెక్స్ లలో కూడా సినిమా ప్రదర్శన నిలిచిపోవడం సంచలనం సృష్టిస్తోంది.

ఇది కేవలం వ్యాపార పోటీనా లేక కావాలనే ఒక సినిమాను తొక్కేసే ప్రయత్నమా అనే అనుమానాలు తలెత్తుతున్నట్లు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ గొడవ ఇలా ముదురుతున్నా టాలీవుడ్ కు చెందిన అగ్ర హీరోలు లేదా ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ దీనిపై స్పందించడం లేదు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా సెటిల్ చేసే కొందరు సీనియర్ స్టార్స్, ఇప్పుడు ఈ గొడవలో తలదూర్చడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని ఫిలిం నగర్ టాక్. సాధారణంగా ఇలాంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే పెద్దలు ఇప్పుడు సైలెంట్ గా ఉండటం వల్ల పరిస్థితి మరింత సీరియస్ గా అనిపిస్తోంది.

ఎవరికి వారు తమ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ వివాదం ఒక కొలిక్కి రావడం లేదని ఇన్ సైడ్ సర్కిల్స్ సమాచారం. ఒక పెద్ద నిర్మాణ సంస్థకు ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఇండస్ట్రీకి ఎప్పుడూ క్షేమకరం. కానీ ఇక్కడ మల్టీప్లెక్స్ స్క్రీన్లను కూడా అడ్డుకోవడం అనేది ఒక రకమైన ఆధిపత్య ధోరణిలా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఒక సినిమా విడుదలను అడ్డుకోవడం వల్ల కేవలం నిర్మాతలకే కాదు, దానిపై ఆధారపడ్డ ఎంతో మంది కార్మికులకు కూడా నష్టం వాటిల్లుతుంది.

అయినా సరే, ఇండస్ట్రీలో సంక్షోభం వచ్చినప్పుడు స్పందించే పెద్దలు ఈ ఇష్యూను పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతానికి ఈ ‘జెట్ లీ’ వివాదం ఒక పంతం లాగా మారిపోయిందని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒకవైపు మైత్రీ సంస్థ సోషల్ మీడియాలో తమ వాదనను బలంగా వినిపిస్తోంది. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి కూడా ఒత్తిడి తగ్గడం లేదు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరాలంటే పెద్దల జోక్యం తప్పనిసరి అని మరికొందరు భావిస్తున్నారు. లేదంటే ఈ ఎఫెక్ట్ రాబోయే మరికొన్ని సినిమాలపై కూడా పడే ఛాన్స్ ఉంది. మరి ఇప్పటికైనా టాలీవుడ్ పెద్దలు స్పందించి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెడతారో లేదో చూడాలి.