Begin typing your search above and press return to search.

పూరి - సేతుపతి.. రంగంలోకి టాప్ ప్రొడక్షన్

టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఈసారి ఓ ప్రయోగాత్మకమైన కథతో సిద్ధమవుతున్నాడు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 12:45 PM IST
పూరి - సేతుపతి.. రంగంలోకి టాప్ ప్రొడక్షన్
X

టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఈసారి ఓ ప్రయోగాత్మకమైన కథతో సిద్ధమవుతున్నాడు. మాస్ డైలాగ్స్, పంచ్ లైన్స్, కమర్షియల్ టచ్‌తో ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన పూరి ‘లైగర్’ తర్వాత బాక్సాఫీస్ వద్ద కొంత వెనకబడ్డారు. ఇక ఇప్పుడు తిరిగి ఫుల్ జోష్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. తన తదుపరి సినిమాను టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతితో కలిసి రూపొందించనున్నాడు.


ఈసారి పూరీ జగన్నాథ్ సొంత ప్రొడక్షన్ లో మాత్రమే కాకుండా.. మరో పెద్ద ప్రొడక్షన్ హౌస్‌తో చేతులు కలిపాడు. JB మోషన్ పిక్చర్స్ అధినేత JB నారాయణరావు కొండ్రోలాతో కలిసి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించనున్నాడు. ప్రాజెక్ట్ పరంగా ఇది ఎంతో విశేషమైన కలయికగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కమిట్‌మెంట్, విజన్ కలిగిన బలమైన మద్దతు తన పక్కన ఉంటేనే.. ఈ స్కేలు మీద ప్రాజెక్ట్ చేయగలమని పూరీ భావించాడట.

ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భారీ క్యాస్టింగ్ ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. సీనియర్ నటీమణి టబు, విలన్‌గా దునియా విజయ్, లీడింగ్ లేడీగా సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరందరూ కథలో కీలక పాత్రలు పోషించబోతున్నారని సమాచారం. చార్మీ కౌర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఒకవైపు ఫైర్ మాస్ ఎలిమెంట్స్.. మరోవైపు ఇంటెన్స్ డ్రామాతో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు.

ఈ సినిమా పూరీ జగన్నాథ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుందని మేకర్స్ చెబుతున్నారు. విజువల్‌గా ఈ చిత్రం సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్తగా ఆవిష్కరించబోతోందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిశాయి. మొదటి షెడ్యూల్ కోసం హైదరాబాదు, చెన్నై వంటి కీలక లొకేషన్లను ఎంపిక చేశారు.

పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీనితో పాటు టైటిల్‌గా “బెగ్గర్” అనే పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ తన సిగ్నేచర్ మాస్ స్టైల్‌తో మరోసారి ప్రేక్షకుల్ని థియేటర్‌ల్లో ఉర్రూతలూగించాలనే ఆలోచనలో ఉన్నాడు. మొత్తానికి ఈ సినిమాతో పూరీ తానేంటో మరోసారి చూపించబోతున్నాడన్న అంచనాలు విపరీతంగా ఉన్నాయి. మరి విజయ్ సేతుపతితో అతని కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.