కాన్వెంట్ అమ్మాయి? తెలుగు సరిగ్గా రాదన్నారు!
తెలుగు పరిశ్రమలో ఓ లెజెండరీ నటిగా ఎదిగారు. అలాంటి నటి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
By: Tupaki Desk | 16 Sept 2025 6:00 AM ISTసహజ నటి జయసుధ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఐదు దశాబ్దాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సేవలందిస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో నటించి సహజనటిగా తెలుగు ప్రేక్షకుల హృద యాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై హీరోయిన్ అవ్వడం...అటుపై అంచలం చెలుగా ఎదగడం తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి నేటి జనరేషన్ హీరోల వరకూ అందరితోనూ కలిసి పని చేసారు. నటిగా ఎలాంటి పాత్ర వచ్చినా కాదనకుండా నటించడం ఆమె ప్రత్యేకత. అందుకే ఐదు దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించగలిగారు.
తెలుగు పరిశ్రమలో ఓ లెజెండరీ నటిగా ఎదిగారు. అలాంటి నటి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ప్రముఖ సీనియర్ దర్శకులు గోపాలకృష్ణ ఆమె గురించి కొన్ని విషయాలు పంచు కున్నారు. పెద్దాయన `లక్ష్మణ రేఖ` సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవలే ఈ చిత్రం రిలీజ్ అయి 50 ఏళ్లు పూర్తయిన సంద ర్భంగానే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. `వీరాభిమన్యు` సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను.
అటుపై లక్ష్మణ రేఖతో డైరెక్టర్ అయ్యాను. ఇది మరాఠీ సినిమాకు రీమేక్ రూపం. ఆ సినిమా నేను చూసాను. అందులో జడ్జి పాత్రకు గుమ్మడి బాగుంటారని, మిగతా నటులు మీ ఇష్టం అని నిర్మాతలు ఛాయిస్ ఇచ్చా రు. నాకు తెలిసిన వాళ్లందర్నీ హీరోయిన్ గా అడిగితే వాళ్లెవ్వరూ ఖాళీగా లేరు. ఆసమయంలోనే `నోము` సినిమా చూసాను. అందులో చిన్న పాత్ర పోషించిన జయసుధను చూసాను. దీంతో వెంటనే తనే హీరో యిన్ అయితే బాగుంటుందనిపించింది. కొన్ని రోజులకు సినిమా ప్రారంభోత్సవం రోజున గుమ్మడి కి జయ సుధని పరిచయం చేసానన్నారు.
ఇందులో తనే మెయిన్ లీడ్ అనగానే గుమ్మడి ఆశ్చర్యపోయారు. ఈమె హీరోయిన్ నా? అన్నారు. ఏ సినిమాలు చేసిందని అడిగారు? లేడీ ఓరియేంటెడ్ కథ అంటున్నారు. హీరోయిన్ గా అనుభవం లేదు. కాన్వెంట్ అమ్మాయిలా ఉంది. తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతుంది? ఇలాగైతే ఎలా అన్నారు. ఆ సమయంలో జయసుధతో పాటు తల్లిదండ్రులు కూడా వెంట ఉన్నారు. ఈ అమ్మాయి పనికి రాదనేసారు. దీంతో వాళ్లు లేచి వెళ్లిపోయారు. ఆ తర్వాత నేను కన్విన్స్ చేయడంతో ఒకే చేసారు. అలా జయసుధ `లక్ష్మణ రేఖ` సినిమాలో భాగమయ్యారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. నటిగా జయసుధ ప్రయాణం అప్పుడే మొదలైంది.
