జయం రవి చేసిన పనికి మహిళల శాపాలు!
భార్యా భర్తల గొడవలు, ట్రామా లైఫ్ ఇతరులకు కచ్చితంగా వినోదాన్ని పంచే మెటీరియల్.
By: Tupaki Desk | 21 May 2025 11:07 PM ISTభార్యా భర్తల గొడవలు, ట్రామా లైఫ్ ఇతరులకు కచ్చితంగా వినోదాన్ని పంచే మెటీరియల్. జయం రవి- ఆర్తి దంపతుల మధ్య వివాదంలో.. అలాంటి వినోదాన్ని నెటిజనులు ఆస్వాధిస్తున్నారు. తాజాగా జయం రవి ఓ కొత్త పోస్ట్ తో వచ్చాడు. అతడు ఒక ఫోటోని షేర్ చేసి దానికి ఇచ్చిన క్యాప్షన్ నెటిజనులను మరిగించింది.
అతడు ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్ అందుకుని నవ్వుతూ ఏదో మాట్లాడుతున్న ఫోటోని షేర్ చేసాడు. దీనికి `న్యూస్ ఇన్‌కమింగ్` అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ క్యాప్షన్ చదవగానే చాలా మంది ఎక్స్ ఖాతాలో సీరియస్ గా స్పందించారు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ... అసలు ఆడదాని బాధను చూస్తూ నవ్వేవాడు సైకో! అని శాపం పెట్టింది. ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.. ఇదేమి పరాచికం? అని ప్రశ్నించారు మరొకరు. నీ భార్య నిన్ను మోసం చేసి వేరొకరితో కులికితే నువ్వు ఆనందంగా ఉంటావా? అని ఒకరు.. `కర్మ రిటర్న్స్` అంటూ మరొకరు తిట్లు శాపనార్థాలతో జయం రవిపై విరుచుకుపడ్డారు.
ఆర్తి రవి తనకు నెలవారీగా 40లక్షల భరణం చెల్లించాలని తన భర్త జయం రవిపై పిటిషన్‌లో కోరిందని ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత జయం రవి ఈ కొత్త పోస్ట్ ని షేర్ చేసాడు. దీంతో నెటిజనుల్లో దీనిపై బోలెడంత చర్చ సాగుతోంది. భార్య బాధలతో కలతగా ఉంటే నీకు ఆనందంగా ఉందా? నవ్వులాటగా ఉందా? అంటూ జయం రవిపై మహిళామణులు సోషల్ మీడియాల వేదికగా విరుచుకుపడుతున్నారు.
