Begin typing your search above and press return to search.

మ‌రోసారి వార్త‌ల్లో ర‌వి మోహ‌న్.. ఎందుకంటే

త‌మిళ యాక్ట‌ర్ జ‌యం ర‌వి గ‌త కొన్ని నెల‌లుగా వివిధ కార‌ణాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నాడు.

By:  Tupaki Desk   |   9 May 2025 4:23 PM IST
మ‌రోసారి వార్త‌ల్లో ర‌వి మోహ‌న్.. ఎందుకంటే
X

త‌మిళ యాక్ట‌ర్ జ‌యం ర‌వి గ‌త కొన్ని నెల‌లుగా వివిధ కార‌ణాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నాడు. త‌న భార్య ఆర్తితో జ‌యం ర‌వి విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన త‌ర్వాత ఆర్తి ర‌వి గురించి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. భార్య‌తో విడిపోయిన త‌ర్వాత జ‌యం ర‌వి ప్ర‌ముఖ సింగ‌ర్ కెనీషా ఫ్రాన్సిస్ తో డేటింగ్ లో ఉన్న‌ట్టు వార్త‌లొచ్చాయి.

కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేద‌ని, తాము కేవ‌లం ఫ్రెండ్స్ మాత్ర‌మే అంటూ ఇద్ద‌రూ క‌వ‌ర్ చేశారు. కానీ తాజాగా వారిద్ద‌రూ ఓ పెళ్లి వేడుక‌లో జంట‌గా క‌నిపించి అంద‌రికీ షాకిచ్చారు. దీంతో వీరిపై గతంలో వ‌చ్చిన వార్త‌లన్నీ నిజ‌మేన‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. వేల్స్ యూనివ‌ర్సిటీ చైర్మ‌న్ ఇషారి కె. గణేష్ కూతురు పెళ్లి చెన్నైలో జ‌ర‌గ్గా ఆ పెళ్లికి జ‌యం ర‌వితో పాటూ సింగ‌ర్ కెనిషా ఫ్రాన్సిస్ క‌లిసి హాజ‌రైంది.

దానికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో త‌మ మ‌ధ్య ఎలాంటి ప్రేమ లేదు, స్నేహం మాత్ర‌మే ఉంద‌ని చెప్పిన ఈ జంట ఇప్పుడు ఇలా క‌నిపించ‌డంతో మ‌ళ్లీ రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. అయితే సింగ‌ర్ కెనీషా వ‌ల్లే జ‌యం ర‌వి త‌న భార్యకు విడాకులిచ్చిన‌ట్టు గ‌తంలో వార్త‌లొచ్చిన విష‌యం తెలిసిందే.

కానీ వారు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు కూడా త‌మ బంధాన్ని బ‌య‌ట‌పెట్టింది లేదు. త‌ము కేవ‌లం ఫ్రెండ్స్ మాత్ర‌మేన‌ని, వృత్తిప‌రంగానే తామిద్ద‌రూ క‌లిశామ‌ని చెప్ప‌డంతో పాటూ అన‌వ‌సరంగా విడాకుల విష‌యంలో మూడో వ్య‌క్తిని తీసుకొస్తున్నార‌ని జ‌యం ర‌వి అన్నారు. ఇదిలా ఉంటే జ‌యం ర‌వి ఆయ‌న పేరును త్వ‌ర‌లోనే ర‌వి మోహ‌న్ గా మార్చుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు.