Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పిన కోలీవుడ్ న‌టుడు

ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్‌ వల్ల సినిమాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన రవి, ఆ డెసిష‌న్ ను వెనక్కి తీసుకుంటూ ఫ్యాన్స్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   8 July 2026 11:18 PM IST
ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పిన కోలీవుడ్ న‌టుడు
X

కోలీవుడ్ న‌టుడు రవి మోహన్(జయం రవి) మరోసారి తన కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. గత కొన్ని నెలలుగా ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలిచిన ఆయన, ఇప్పుడు ఎమోష‌న‌ల్ స్పీచ్‌తో కొత్త ఆరంభాన్ని ప్రకటించారు. ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్‌ వల్ల సినిమాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన రవి, ఆ డెసిష‌న్ ను వెనక్కి తీసుకుంటూ ఫ్యాన్స్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఒక సినీ కార్యక్రమంలో పాల్గొన్న రవి మోహన్, తన లైఫ్ లో ఒక కీలక దశ ముగిసిందని, ఇప్పుడు పూర్తిగా కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని అన్నారు. ఇది త‌న‌కు రెండో జన్మ లాంటిదంటూ చేసిన కామెంట్స్ ఆయన మానసిక స్థితిని ప్రతిబింబించాయి. గతంలో జరిగిన పరిణామాలను వెనక్కి వదిలేసి, ఇకపై యాక్ట‌ర్‌గా ఆడియ‌న్స్ ను మంచి సినిమాలతో అలరించడమే తన మెయిన్ టార్గెట్ అని స్పష్టం చేశారు.

కొద్ది నెలల క్రితం రవి మోహన్ వ్యక్తిగత జీవితం తీవ్ర చర్చకు దారి తీసింది. భార్య ఆర్తితో ఏర్పడిన విభేదాలు, త‌ర్వాత సింగ‌ర్ కెనీషాతో ఆయన పేరు వినిపించడం, సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు వరుసగా వార్తల్లో నిలిచాయి. సిట్యుయేష‌న్స్ మరింత ఉద్రిక్తంగా మారడంతో మీడియా ముందుకు వచ్చిన రవి, తనపై, కెనీషాపై జరుగుతున్న ట్రోలింగ్, ఆరోపణలపై స్పందించారు.

ఆ తర్వాత రవి మోహన్ కొంతకాలం పూర్తిగా మీడియాకు దూరంగా ఉన్నారు. కొత్త సినిమాల గురించి కూడా ఎలాంటి అనౌన్స్‌మెంట్స్ చేయలేదు. దీంతో ఆయన కెరీర్‌పై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు అదే రవి మోహన్ మళ్లీ ప్రజల ముందుకు వచ్చి తన నిర్ణయాన్ని మార్చుకోవడం, అభిమానులను ఉద్దేశించి క్షమాపణ చెప్పడం ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా భావిస్తున్నారు. తన స్పీచ్ లో ఇప్పటివరకు తాను పోషించిన గుర్తుండిపోయే పాత్రలను ప్రస్తావించిన రవి, ఫ్యూచ‌ర్ లో కూడా అలాంటి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడటం కంటే, కొత్త టార్గెట్స్ తో ముందుకు సాగడమే తన డెసిష‌న్ అని ఆయన వివరించారు.

ఇక రవి మోహన్ రీఎంట్రీకి ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న బ్రో కోడ్ వేదిక కానుంది. ఈ సినిమాలో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప‌ర్స‌న‌ల్ వివాదాల తర్వాత రవి మోహన్ చేస్తున్న ఈ కొత్త ఆరంభం ఆయన కెరీర్‌కు ఎంతవరకు కొత్త ఊపు తీసుకువస్తుందో, అభిమానులు ఆయనను ఎలా ఆదరిస్తారో చూడాల్సి ఉంది.