చాహల్-జయం రవి ఎంత మంచివాళ్లు?
తమ ఉత్తమ స్నేహితులను పదే పదే పొగిడేస్తూ కొత్త స్నేహితురాళ్లు సోషల్ మీడియాలకు మేత వేస్తున్నారు.
By: Tupaki Desk | 19 May 2025 8:08 PM ISTమంచి వాడు..
వినయంగా ఉంటాడు..
ఎదుటివారిని గౌరవిస్తాడు..
బిజీగా ఉన్నా కేర్ తీసుకుంటాడు...
ఇలాంటి మంచి మాటలు ఎవరైనా అమ్మాయి అబ్బాయి గురించి చెబుతుంటే దానివెనక అర్థం ఏమిటో గ్రహించకుండా ఉంటారా? గత కొంతకాలంగా క్రికెటర్ చాహల్ గురించి అతడి స్నేహితురాలు, ఆర్జే మహ్‌వాష్ కానీ, కోలీవుడ్ హీరో జయం రవి గురించి అతడి స్నేహితురాలు కెనీషా కానీ చెబుతున్న మాటలివి. మేం మంచి స్నేహితులం మాత్రమేనని కవరింగ్ ఇస్తున్నా, వారి మధ్య ఇంకేదో జరుగుతోందని నెటిజనులు అనుమానిస్తూనే ఉన్నారు. తమ ఉత్తమ స్నేహితులను పదే పదే పొగిడేస్తూ కొత్త స్నేహితురాళ్లు సోషల్ మీడియాలకు మేత వేస్తున్నారు.
అప్పటికే పెళ్లయి భార్యకు విడాకులిచ్చిన ఇద్దరు ప్రముఖులకు ఇంత మంచి స్నేహితురాళ్లు లభించడం గొప్ప ఊరట! అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. భార్య భర్తల నడుమ వివాదాలు ఆన్ లైన్ లో, సోషల్ మీడియాల్లో రచ్చకెక్కుతున్న ఈ యుగంలో జయం రవి, చాహల్ గురించి స్నేహితురాళ్లు పాజిటివ్ నోట్ ఇవ్వడం అనేది వారిలో ఎనర్జీ లెవల్స్ ని పెంచుతోంది. ముఖ్యంగా వారి మధ్య స్వచ్ఛమైన స్నేహం ఎంతో ముచ్చటేస్తోందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
క్రికెటర్ చాహల్ తన భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ నుంచి విడిపోయాడు. విడిపోయే క్రమంలోనే ఆర్జే మహ్ వాష్‌తో కలిసి షికార్లు చేయడం సంచలనంగా మారింది. అలాగే జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడిపోయేందుకు విడాకులకు దాఖలు చేసాడు. కానీ విడిపోక ముందే, తన స్నేహితురాలు గాయని, మానసిక వైద్య నిపుణురాలు కెనీషాతో ఎంతో సన్నిహితంగా కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ జంట ఇటీవలే ఓ పెళ్లిలో కూడా సందడి చేసిన విజువల్స్ ప్రకంపనాలు రేపాయి. ఇలా కొత్త స్నేహితులతో షికార్లు చేస్తున్న జయం రవి, చాహల్ లకు ఇరుగు పొరుగు నుంచి అక్షింతలు కూడా పడుతూనే ఉన్నాయి. కొందరు సహచరులు, నెటిజనులు కూడా వారి వ్యవహారాన్ని విమర్శిస్తూనే ఉన్నారు.
