నెలకు 40 లక్షలు ఇవ్వాలంటూ భార్య డిమాండ్!
దీంతో జయం రవి స్పందించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12 లోపు కౌంటర్ వేయాల్సింది కోర్టు ఆదేశించింది.
By: Tupaki Desk | 21 May 2025 4:18 PM ISTజయం రవి-ఆర్తిల విడాకుల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ మారుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరువురు విడాకుల కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కేసుకు సంబంధించి విచరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జయం రవి తన గర్ల్ ప్రెండ్ గా తెరపైకి వస్తోన్న సింగర్ కెన్నీషాతో ఓ వివాహానికి హాజరు కావడంతో సీన్ మళ్లీ వెడెక్కింది. ఆర్తికి దూరమైన తర్వాత ప్రశాంతంగా ఉన్నానని..పంజరం నుంచి బయట కువచ్చినట్లు ఉందని ఓ లేఖ రిలీజ్ చేసాడు రవి.
ప్రతిగా ఆర్తీ మూడవ వ్యక్తి వల్లే విడిపోవాల్సి వస్తుందని స్పందించింది. మూడో వ్యక్తి ప్రమేయానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ మరో లేఖ రిలీజ్ చేసింది. రెండు..మూడు రోజులుగా ఈ పంచాయతీ హాట్ టాపిక్ గా మారిన నేపత్యంలో ఆర్తి మరో ట్విస్ట్ ఇచ్చింది. నెలకు 40 లక్షలు చెల్లించాలని ఆర్తి కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసింది. ఇది కేవలం నెలవారీ భరణంగా కేసు వేసింది.
దీంతో జయం రవి స్పందించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12 లోపు కౌంటర్ వేయాల్సింది కోర్టు ఆదేశించింది. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ లీగల్ వార్ మొదలైంది. విడాకుల ముందు ఇద్దరి మధ్య మాటల యుద్దం...అటుపై పెద్దల ఎంట్రీతో విడాకుల పంచాయతీ హాట్ టాపిక్ మారింది. ఇరువురు చట్టపరమైన చర్యలకు దిగడంతో కొన్ని రోజుల పాటు వ్యవహారం సైలెంట్ గా ఉంది.
కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరవుతున్నారు. మరి భరణం పిటీషన్ పై జయం రవి ఎలా స్పంది స్తాడో చూడాలి. ప్రస్తుతం జయం రవి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మూడు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉండగా మరో చిత్రం ఇటీవలే ప్రకటించారు. సెట్స్ లో ఉన్న చిత్రాలు ఇదే ఏడాది రిలీజ్ అవుతుండగా...కొత్త చిత్రం మాత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
