జయం రవి- ఆర్తి వివాదం.. ఇకపై రచ్చకెక్కితే కుదరదు!
సెలబ్రిటీల విడాకుల వార్తలు మీడియాలో హాట్ టాపిగ్గా మారుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 May 2025 6:08 PM ISTసెలబ్రిటీల విడాకుల వార్తలు మీడియాలో హాట్ టాపిగ్గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జయం రవి- ఆర్తి దంపతుల విడాకుల గొడవ మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది. ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. మీడియా ఎదుటకు వచ్చి లేదా సోషల్ మీడియాల్లో పోస్టింగులతో ఒకరినొకరు విమర్శించుకునేందుకు తపించారు. ఇదంతా పెద్ద రచ్చయింది.
తమ బ్రేకప్ కి కారణం `మూడో వ్యక్తి` అంటూ ఆర్తి రవి విమర్శించారు. కెనీషా తన స్నేహితురాలు మాత్రమేనని జయం రవి (రవి మోహన్) వివరణ ఇచ్చారు. ఆర్తి తల్లి కూడా మీడియా ఎదుటికి వచ్చి తన అల్లుడు వల్ల వంద కోట్లు పైగా అప్పు చేసానని వ్యాఖ్యానించారు. అలాగే ఆర్తి తన భర్త మోహన్ తనకు 40లక్షల భరణం చెల్లించాలని డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఇకపై ఇలాంటి ప్రచారం తగదని చెన్నై హైకోర్టు ఈరోజు ఉత్తర్వు జారీ చేసింది. కేసు కోర్టులో ఉన్నందున ఆ ఇద్దరిలో ఎవరూ ఎటువంటి బహిరంగ ప్రకటనలు లేదా పత్రికా ప్రకటనలు చేయవద్దని కోరింది. ఒకరినొకరు ఇకపై పబ్లిగ్గా దూషించుకోవడం నిషిద్ధం.
ఆర్తి రవి పదే పదే కెనీషా గురించి ఫిర్యాదు చేస్తోంది. మూడో వ్యక్తి అంటూ ప్రస్థావిస్తోంది. కానీ జయం రవి ఆమెను కేవలం స్నేహితురాలు మాత్రమేనని చెబుతున్నాడు. ఈ కేసులో చివరికి ఏమి తేలనుందో వేచి చూడాలి. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 12న జరుగుతుంది.
