Begin typing your search above and press return to search.

షారుఖ్ 'జవాన్'.. తెలుగు రైట్స్ ఎంతంటే?

షారుఖ్ ఖాన్ నుంచి కూడా ఈ ప్రొపోజల్ ఓకే అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

By:  Tupaki Desk   |   1 Aug 2023 3:51 AM GMT
షారుఖ్ జవాన్.. తెలుగు రైట్స్ ఎంతంటే?
X

షారుఖ్ ఖాన్ హీరో గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ జవాన్. ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్ భాషల లో రిలీజ్ కాబోతోంది. షారుఖ్ సొంత బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో జవాన్ మూవీ చేశారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన జవాన్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సినిమా పైనే హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే చిత్రం లో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ గా చిత్రం లో కనిపిస్తునానరు. సౌత్ యాక్టర్స్ చాలా మంది జవాన్ సినిమా లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మూవీ తెలుగు రిలీజ్ రైట్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ డిస్టిబ్యూటర్స్ జవాన్ తెలుగు రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. సుమారు 23 కోట్ల వరకు రైట్స్ కోసం ఆఫర్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నుంచి కూడా ఈ ప్రొపోజల్ ఓకే అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

షారుఖ్ చివరి చిత్రం పఠాన్ తెలుగు రాష్ట్రాల లో ఏకంగా 56 కోట్ల వరకు రెండు భాషలలో కలిపి కలెక్ట్ చేసింది. ఓ విధంగా బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి అందుకున్న మూవీగా పఠాన్ నిలిచింది. అయితే ఆ రికార్డ్ ని జవాన్ అందుకోకపోయిన కచ్చితంగా 45 కోట్ల గ్రాస్ ని టచ్ చేస్తేనే సక్సెస్ అయినట్లు అవుతుంది. జవాన్ సినిమా కి కంప్లీట్ గా సౌత్ టచ్ ఉంటుంది కాబట్టి కచ్చితంగా చిత్ర యూనిట్ పెట్టుకున్న టార్గెట్ టచ్ చేయడం పెద్ద కష్టమైన విషయం కాదని చెప్పాలి.

గట్టిగా ట్రై చేస్తే మరోసారి తెలుగు రాష్ట్రాల లో 50 కోట్ల గ్రాస్ ని జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ అందుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో సౌత్ లో షారుఖ్ కి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఓపెనింగ్స్ అయితే సాలిడ్ గా వస్తాయి. తరువాత కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ గా ప్రేక్షకాదరణ వస్తుందని చెప్పొచ్చు. షారుఖ్ ఖాన్ కూడా జవాన్ సినిమా లో చాలా కసిగా తీసుకొని చేసినట్లు కనిపిస్తోంది.

టీజర్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే క్యారెక్టరైజేషన్ విషయం లో అట్లీ డిఫరెంట్ అప్రోచ్ కనిపిస్తోంది. దాంతో పాటు ఈ దర్శకుడి మూవీ అంటే కచ్చితంగా ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ ని టచ్ చేస్తాడు. ప్రతి సినిమాకి యూనిక్ గా ఒక థీమ్ తీసుకుంటాడు. అలాగే దేశభక్తి సినిమా విషయంలో అట్లీ ఎలాంటి థీమ్ ఎంచుకున్నాడనే ఆసక్తి కూడా అందరిలో నెలకొని ఉంది.