Begin typing your search above and press return to search.

ఎదురు చూస్తున్న రెండు వచ్చేశాయి.. చూశారా?

ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ మూవీ జవాన్ ఎట్టకేలకు నెట్‌ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 5:59 AM GMT
ఎదురు చూస్తున్న రెండు వచ్చేశాయి.. చూశారా?
X

ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ మూవీ జవాన్ ఎట్టకేలకు నెట్‌ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు షారుఖ్ ఖాన్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా నెట్‌ ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అర్థ రాత్రి నుంచి ఈ సినిమాలను లక్షల మంది చూస్తూనే ఉన్నారు.

థియేట్రికల్ రిలీజ్ లో దాదాపుగా రూ.1100 కోట్ల వసూళ్లు నమోదు చేసిన జవాన్ సినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా అదే రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ తో పాటు నెట్‌ ఫ్లిక్స్ ఇండియా సోషల్‌ మీడియా టీమ్‌ పెద్ద ఎత్తున ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని ప్రచారం చేస్తూ ఉన్న కారణంగా తక్కువ సమయంలోనే టాప్‌ ట్రెండింగ్ సినిమాల జాబితాలో జవాన్ నిలువబోతుంది.

తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించగా, కీలక పాత్రలో దీపికా పదుకునే నటించింది. ఇద్దరు ముద్దుగుమ్మలు ఉండటంతో పాటు షారుఖ్ ఖాన్ డబుల్‌ రోల్‌ లో కనిపించడం వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఓటీటీ లో జవాన్ ను హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ చేశారు.

ఇక ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో సినిమా రామ్‌ హీరోగా నటించిన స్కంద. బోయపాటి దర్శకత్వం లో రూపొందిన స్కంద సినిమా కు థియేట్రికల్‌ రిలీజ్ లో ఆశించిన స్థాయి లో పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు.

ఎట్టకేలకు స్కంద సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ మొదలు అవ్వడంతో అభిమానులు మరియు ప్రేక్షకులు అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌ మొదలు పెట్టారు. ఈ సినిమాను ప్రేక్షకులు డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయవచ్చు. ఈ సినిమాలో రామ్ కు జోడీగా శ్రీలీల నటించింది. వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. కానీ వసూళ్లు మాత్రం పెద్దగా రాలేదు.