Begin typing your search above and press return to search.

జవాన్ బుకింగ్స్.. షారుఖ్ మాస్ ర్యాంపేజ్..!

అంటే ఈ లెక్కన 8 కోట్లు రిలీజ్ ముందే కలెక్ట్ చేసింది జవాన్. రిలీజ్ కు ఇంకా ఐదు రోజులు ఉంది కాబట్టి ఈలోగా ఈ ఫిగర్ కూడా మారే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 6:49 AM GMT
జవాన్ బుకింగ్స్.. షారుఖ్ మాస్ ర్యాంపేజ్..!
X

షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ తో సౌత్ డైరెక్టర్ కాంబో ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. ఇదివరకు ఇలా డైరెక్టర్ హీరో కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లు సాధించాయి. ఇక అట్లీ కూడా తమిళంలో సూపర్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అట్లీ షారుఖ్ తో జవాన్ చేశాడు. షారుఖ్ ఖాన్ కూడా పఠాన్ ముందు వరకు వరుస ఫ్లాపులు అందుకోగా పఠాన్ మళ్లీ ఆయన్ను ఫాంలోకి వచ్చేలా చేసింది.

జవాన్ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. రిలీజ్ ఇంకా వారం రోజులు ఉంది అనగానే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా షారుఖ్ జవాన్ దూకుడు చూపిస్తుంది. రిలీజ్ ఇంకా ఐదు రోజులు ఉన్నా సరే బుకింగ్స్ అదిరిపోయాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే 2 లక్షల 35 వేల టికెట్లు బుక్ అయిపోయాయి. అంటే ఈ లెక్కన 8 కోట్లు రిలీజ్ ముందే కలెక్ట్ చేసింది జవాన్. రిలీజ్ కు ఇంకా ఐదు రోజులు ఉంది కాబట్టి ఈలోగా ఈ ఫిగర్ కూడా మారే అవకాశం ఉంది.

పఠాన్ సక్సెస్ షారుఖ్ కి సూపర్ బూస్ట్ ఇవ్వగా ఆ సినిమా వల్ల జవాన్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ఇక రిలీజైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈసారి సౌత్ లో కూడా షారుఖ్ ఖాన్ సూపర్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందనిపిస్తుంది. బాలీవుడ్ ఆడియన్స్ కోరుతున్న మాస్ మసాలా సినిమాగా జవాన్ వస్తుంది. అక్కడ ఆ సినిమాలు తగ్గబట్టే సౌత్ సినిమాల మీద పడుతున్నారు బీ టౌన్ ఆడియన్స్. అందుకే కరెక్ట్ టైం లో షారుఖ్ జవాన్ సినిమాతో వస్తున్నారు.

ఈ సినిమాలో నయనతార, దీపిక పదుకొనే హీరోయిన్స్ గా నటించారు. అనిరుద్ మ్యూజిక్ కూడా జవాన్ కు మరో అసెట్ అవుతుంది. జవాన్ ఫస్ట్ డే కూడా భారీగానే వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పఠాన్ తో 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసిన షారుఖ్ మరోసారి అది సాధించాలని చూస్తున్నారు. మరి జవాన్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి. ఆల్రెడీ తమిళంలో రీసెంట్ గానే భారీ ఈవెంట్ నిర్వహించారు. తెలుగులో మాత్రం ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.