Begin typing your search above and press return to search.

పట్టుపంచలో స్వామివారి ఆలయానికి షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్ షారూక్ ఖాన్ కి పరిచయం అవసరం లేదు. ఆయనకు కేవలం బాలీవుడ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది

By:  Tupaki Desk   |   5 Sep 2023 5:56 AM GMT
పట్టుపంచలో స్వామివారి ఆలయానికి షారుఖ్ ఖాన్
X

బాలీవుడ్ బాద్ షారూక్ ఖాన్ కి పరిచయం అవసరం లేదు. ఆయనకు కేవలం బాలీవుడ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. షారూక్ చివరగా పఠాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత ఆయనకు వచ్చిన హిట్ ఇది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కాగా, ఈసారి తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ లో నటించారు. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఆయన తన జీవితంలో ఎప్పుడూ చేయని పనిని చేశారు.

షారూక్ తొలిసారి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. తన జవాన్ మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటూ, ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం విశేషం. తనతో పాటు ఆయన కుమార్తె సుహానా కూడా ఆలయానికి వచ్చింది. స్వామివారిని దర్శించుకునే సమయంలో షారూక్ పట్టుపంచ ధరించడం విశేషం.

ఇక,షారూక్ ఖాన్ ముస్లిం అయినప్పటికీ తిరుపతికి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు తిరుమలకు రాలేదు. కానీ, ఈ సారి ఆయన జవాన్ హడావుడి లో ఆలయానికి వచ్చారు. షారూక్ ఆయన కుమార్తె సహానా, ఇక ఈ మూవీలో హీరోయిన్ నయనతార, ఆమె భర్త విగ్నేష్ కూడా ఆలయానికి వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా, ఈ జవాన్ మూవీ సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ప్రకారం షారూక్ ఓ మెట్రో ట్రైన్ ని హైజాక్ చేస్తాడు..? అలా ఆయన ఎందుకు చేశాడు? ఒక జవాన్ అయ్యి ఉండి ఆయన అలా ఎందుకు చేశాడు? షారూక్ కీ, నయనతారకు మధ్య సంబంధం ఏంటి అనేవి తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఇక, ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఓ పోలీసు అధికారిగా ఇందులో కనిపిస్తుండటం విశేషం. ఈ జవాన్ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఆయన లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమాని రెడ్ చిల్లీస్ ఎంటర్ ట్రైన్మెంట్ బ్యానర్ పై షారూక్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం. మరి ఈ సినిమా షారూక్ కి ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.