Begin typing your search above and press return to search.

దారుణమైన నెంబర్స్‌... టైగర్‌ పై కనిపించని జవాన్‌ ఎఫెక్ట్‌

సినిమా ఫలితం ఏంటి అనేది తేలకుండానే బాక్సాఫీస్‌ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు పెదవి విరిచే విధంగా టైగర్‌ 3 యొక్క నెంబర్స్ నమోదు అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:06 AM GMT
దారుణమైన నెంబర్స్‌... టైగర్‌ పై కనిపించని జవాన్‌ ఎఫెక్ట్‌
X

బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్ ఖాన్‌ ఈ ఏడాదిలో పఠాన్ మరియు జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడేశాడు. రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేశాయి. షారుఖ్‌ సినిమాలు కచ్చితంగా బాలీవుడ్‌ కు బూస్ట్‌ ను తెచ్చి పెడుతాయి, అంతే కాకుండా ఈ మధ్య కాలంలో దక్కని విజయాలను ఆ రెండు సినిమాల వల్ల బాలీవుడ్‌ చూడబోతుందని విశ్లేషకులు చాలా నమ్మకంగా ఉన్నారు.

పఠాన్‌, జవాన్ సినిమాల విజయంతో చాలా ఆశలు పెట్టుకున్న సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్‌ 3' సినిమాకు ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా ఫలితం ఏంటి అనేది తేలకుండానే బాక్సాఫీస్‌ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు పెదవి విరిచే విధంగా టైగర్‌ 3 యొక్క నెంబర్స్ నమోదు అవుతున్నాయి.

సల్మాన్‌ ఖాన్‌ కి ఉన్న క్రేజ్‌ నేపథ్యం లో ఉత్తర భారతంలో టైగర్‌ 3 కి ఒక మోస్తరు లో అడ్వాన్స్‌ బుకింగ్ జరుగుతున్నాయి. కానీ సౌత్‌ లో మాత్రం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా పరిస్థితి ఉందని నమోదు అవుతున్న కలెక్షన్స్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.

మరో రెండు రోజుల్లో అంటే నవంబర్‌ 12న విడుదల అవ్వబోతున్న టైగర్‌ 3 సినిమాకు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.10 లక్షల విలువైన టికెట్లు అమ్ముడు పోయాయి. ఇక తమిళనాట కనీసం రూ.50 వేల రూపాయలు కూడా టైగర్ 3 కి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా నమోదు అవ్వలేదు. ఇది మరీ దారుణమైన విషయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హిందీ తో పాటు ఇతర భాషల్లో కూడా డబ్‌ చేసి విడుదల చేయాలని పట్టుదలతో ఉన్న మేకర్స్ కి ఈ అడ్వాన్స్ బుకింగ్‌ నెంబర్స్ మింగుడు పడటం లేదు. జవాన్‌ మరియు పఠాన్ లు సౌత్‌ లో మంచి వసూళ్లు నమోదు చేశాయి. కనుక టైగర్‌ 3 పై ఇక్కడి ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చుతారని యూనిట్ సభ్యులు ఆశ పడ్డారు. కానీ ఆ పరిస్థితి, ఆ సినిమాల ఎఫెక్ట్‌ ఏమాత్రం లేదని తేలిపోయింది.