Begin typing your search above and press return to search.

స‌ల్మాన్-అమీర్‌ల‌ను టార్గెట్ చేసిన‌ మాఫియా

దర్శకుడు అట్లీ తన తాజా చిత్రం 'జవాన్' విజయంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ విజ‌యానికి క్రెడిట్ షారుఖ్ ఖాన్‌కు ఇచ్చాడు

By:  Tupaki Desk   |   12 Sep 2023 3:46 AM GMT
స‌ల్మాన్-అమీర్‌ల‌ను టార్గెట్ చేసిన‌ మాఫియా
X

దర్శకుడు అట్లీ తన తాజా చిత్రం 'జవాన్' విజయంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ విజ‌యానికి క్రెడిట్ షారుఖ్ ఖాన్‌కు ఇచ్చాడు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.520 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇటీవల ఇండియన్ ఆర్మీ, ముంబై పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల కోసం ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసిన‌ సందర్భంగా సత్కారం అందుకున్న అట్లీ, షారూఖ్‌ ఖాన్ నటన సినిమా విజయానికి ప్రధాన కారణమని చెప్పాడు.

ఈ విజ‌యం దేవుని ఆశీర్వాద‌మ‌ని కూడా అట్లీ అన్నారు. ''ఇది చాలా గొప్ప విజ‌యం. దేవుడి ఆశీర్వాదం. దేవుడు మాపై చాలా దయతో ఉన్నాడు. ప్రేక్షకులను అలరించడానికి ఫిలింమేక‌ర్స్ గా మా వంతు కృషి చేశామని భావిస్తున్నాను'' అని ఈ సంద‌ర్భంగా అట్లీ అన్నారు. జ‌వాన్ థియేటర్ స్క్రీన్‌పై వినోదాత్మకంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారు జ‌వాన్ పై వారు తమ ప్రేమను కురిపిస్తున్నారు. ఇదంతా షారూఖ్ సర్ కారణంగా సాధ్య‌మైన‌దే. మిస్టర్ షారూఖ్ సర్, రెడ్ చిల్లీస్ కి ధన్యవాదాలు. గత మూడున్నరేళ్లుగా మాతో పగలు రాత్రి పనిచేసిన మొత్తం కోర్ టీమ్ కి థాంక్స్'' అని అన్నారు.

తాను మ‌రోసారి షారూఖ్‌ ఖాన్ తో ప‌ని చేస్తున్నాన‌ని, ఇప్పటికే తమ తదుపరి క‌ల‌యిక‌ను చాలా పెద్ద‌గా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రేక్ష‌కులు మాకు అందించిన ప్రేమ మ‌రింత‌గా ఎదిగేందుకు స‌హ‌క‌రిస్తుంద‌ని, త‌దుప‌రి సినిమాతో మేం మ‌రింత గొప్ప‌గా క‌నిపిస్తామ‌ని అన్నారు. ''నేను అందరితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను. సల్మాన్ సర్‌తో అమీర్ సర్‌తో కలిసి పని చేయాలనుకుంటున్నాను. నేను హృతిక్‌తో కలిసి పని చేయాలనుకుంటున్నాను. ఇది నా మొదటి హిందీ చిత్రం అయినా ఇంత‌ ప్రేమను చూసినందుకు కృతజ్ఞుడను'' అని అన్నారు. జవాన్‌లో షారూఖ్ తో పాటు నయనతార, విజయ్ సేతుపతి కూడా నటించారు. ఈ చిత్రం హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్. అద్భుత‌మైన ఓపెనింగులు సాధించిన ఈ చిత్రం ఫుల్ ర‌న్ లో 1000 కోట్ల క్ల‌బ్ లో చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌పై ఏదైనా సాధ్య‌మే అత‌డికి..

స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఇప్ప‌టికే విజ‌యాల‌ను ఆస్వాధిస్తున్నారు. టైగ‌ర్ 3తో స‌ల్మాన్ - షారూఖ్ జోడీ మ‌రోసారి తెర‌పై క‌నిపించ‌నున్నారు. ఇక ఆ ఇద్ద‌రితో పోలిస్తే అమీర్ ఖాన్ ఇటీవ‌ల రేసులో వెన‌క‌బ‌డ్డారు. నిజానికి ఇది అత‌డికి బ్యాడ్ ఫేజ్. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న భారీ చిత్రం లాల్ సింగ్ చ‌డ్డా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. దీంతో చాలా గ్యాప్ తీసుకుని అతడు మ‌రో సినిమాకి సంత‌కం చేసాడు. ఇటీవ‌లే జియో సినిమాస్ తో భారీ కాంట్రాక్టును కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే అమీర్ కి ఇలాంటి స‌మ‌యంలో స‌రైన మాస్ హిట్ అవ‌స‌రం. అందుకే ఇప్పుడు అట్లీ ఆస‌క్తిని అత‌డు ఎన్ క్యాష్ చేసుకుంటాడ‌నే అభిమానులు భావిస్తున్నారు. అమీర్ - అట్లీ కాంబినేష‌న్ త్వ‌ర‌లోనే సాధ్య‌మ‌వ్వాల‌ని కూడా కోరుకుంటున్నారు. ఆరంగేట్ర చిత్ర‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు గ‌నుక అట్లీకి ఇప్పుడు భార‌త‌దేశంలోని సూప‌ర్ స్టార్లంద‌రితో ప‌ని చేసే అవ‌కాశం ద‌క్కిన‌ట్టే. అట్లీతో ప‌ని చేసేందుకు ఇటువైపు ఎన్టీఆర్, బ‌న్ని లాంటి టాలీవుడ్ అగ్ర హీరోలు ఆస‌క్తిగా ఉన్నారు.