Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్.. ఎవరికి సాధ్యంకాని రికార్డ్!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు

By:  Tupaki Desk   |   19 Sep 2023 3:43 AM GMT
బాక్సాఫీస్.. ఎవరికి సాధ్యంకాని రికార్డ్!
X

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ ఇప్పటికే 800 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకొని వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ వారాంతానికి వెయ్యి కోట్ల ఫీట్ దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఫీట్ తో అరుదైన రికార్డుని షారుఖ్ ఖాన్ తన ఖాతాలో వేసుకోబోతున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన షారుఖ్ ఖాన్ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు. గత రెండేళ్ళ నుంచి గడ్డుకాలం ఎదుర్కొంటున్న బాలీవుడ్ కి పఠాన్ ఊపిరి పోసింది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత బాలీవుడ్ దర్శకులకి అసలు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు అనేది అర్ధమైంది. ఆ దిశగా మళ్ళీ అడుగులు వేస్తున్నారు.

ఇప్పుడు జవాన్ సినిమాతో మాస్, కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేసి షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ కొట్టడమే కాకుండా వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా సాగుతున్నారు. ఈ మూవీ వెయ్యి కోట్లు అందుకుంటే ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోగా బాద్ షా రికార్డు సృష్టిస్తాడు. జవాన్ మూవీ హిట్ తర్వాత నార్త్ ఆడియన్స్ సౌత్ మాస్, మసాలా కథలకి ఎందుకు ఎట్రాక్ట్ అవుతున్నారో స్పష్టం అయ్యింది.

ఈ ఏడాది ఆఖరులో షారుఖ్ ఖాన్ డుంకీ మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. రాజ్ కుమార్ హిరణీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఆయన ఒకరు. దీంతో కచ్చితంగా డుంకీ కూడా వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది బాలీవుడ్ లో సినిమా మార్కెట్ వేల్యూలో మేజర్ షేర్ షారుక్ ఖాన్ దే ఉంటుంది.

అలాగే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన హీరోగా మరో రేర్ ఫీట్ ని అందుకుంటున్నాడు. ఇంకెవరూ కూడా ఆ ఫీట్ ని టచ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు కూడా. షారుఖ్ ఖాన్ ని బాలీవుడ్ షేర్ ఖాన్ అని ఎందుకు అంటారో ఈ సినిమాల రిజల్ట్స్ చూస్తేనే అర్ధమవుతోంది.