Begin typing your search above and press return to search.

జవాన్‌ : బాహుబలి సేఫ్‌, పఠాన్ ఔట్‌

ఆ రికార్డ్‌ ను ఇప్పట్లో ఏ బాలీవుడ్‌ సినిమా కూడా బ్రేక్ చేసే అవకాశం లేదని భావిస్తున్న సమయంలో షారుఖ్ ఖాన్‌ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 10:30 AM GMT
జవాన్‌ : బాహుబలి సేఫ్‌, పఠాన్ ఔట్‌
X

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన జవాన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జవాన్ కు ముందు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో జవాన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్ లో జరిగిందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

పఠాన్ మొదటి రోజు పీవీఆర్‌, ఐనాక్స్‌, సినీ పోలిస్‌ వంటి చైన్ మల్టీప్లెక్స్ లో 5,56,000 టికెట్లు అమ్ముడు పోయాయి. ఆ రికార్డ్‌ ను ఇప్పట్లో ఏ బాలీవుడ్‌ సినిమా కూడా బ్రేక్ చేసే అవకాశం లేదని భావిస్తున్న సమయంలో షారుఖ్ ఖాన్‌ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. స్వల్ప తేడాతో పఠాన్ రికార్డు ను జవాన్ బ్రేక్ చేసినట్లు సమాచారం అందుతోంది.

ఇక బాహుబలి 2 మొదటి రోజు టికెట్‌ బుకింగ్స్ కు సంబంధించిన రికార్డు ఇప్పటికీ అలాగే ఉండటం విశేషం. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ల సినిమాలు ఎన్ని వచ్చినా కూడా ఏ ఒక్కరు కూడా మన బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేయడం లేదు. హిందీ వర్షన్‌ బాహుబలి 2 రికార్డ్‌ స్థాయి అడ్వాన్స్ బుకింగ్‌ జరిగింది. మరింత కాలం ఈ రికార్డ్‌ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

ఇక జవాన్‌ సినిమా పఠాన్ రికార్డ్‌ ను బ్రేక్ చేసిన నేపథ్యంలో లాంగ్ రన్ లో భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పఠాన్ సాధించిన వెయ్యి కోట్ల వసూళ్లను కూడా జవాన్‌ క్రాస్ చేస్తుందని విడుదలకు ముందు జరిగిన అడ్వాన్స్ బుకింగ్‌ ను బట్టి బాక్సాఫీస్ నిపుణులు అంటున్నారు.

మరి సినిమా కు వచ్చిన టాక్ ను బట్టి అంత సాధ్యమా అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్‌ సినిమా లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించడం వల్ల తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమా లో కీలక పాత్రలో నటించాడు.